21 April, 2026 | 4:41 AM

జపాన్‌లో భూకంపం

21-04-2026 03:06 AM
  1. సునామీ హెచ్చరికలు జారీ
  2.   ౩ మీటర్ల ఎత్తున ఎగసిపడిన అలలు
  3. స్వల్పంగా ఆస్తి నష్టం

టోక్యో, ఏప్రిల్ ౨౦: జపాన్ ప్రజలను భూ కంపం వణికించింది. ఈశాన్య తీరంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.7గా నమోదైంది. వెంటనే  పసిఫిక్ మహాసముద్రంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చాయి. భూకంపం ధాటికి సముద్ర తీరం అల్లకల్లోలంగా మారిం ది. తీర ప్రాంతంలోని కొన్నిరోడ్లు, భవనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. ఆ దేశ మెటియోరోలాజికల్ సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది.

సునామీ కారణంగా ఉత్తర ప్రాం తంలోని ఇవాటే, అమోరి, హక్కైడో ప్రాంతాలకు 3 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడ్డాయి. భూకంపం ధాటికి రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. టోక్యో నుంచి అమోరి మధ్య నడి చే బుల్లెట్ రైలు సర్వీసులు రద్దయ్యాయి. అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిం చి తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పెను ప్రమాదం తప్పింది. మరోవైపు, ఆస్తి, ప్రాణనష్టంపై యంత్రాంగం అంచనా వేసే పనిలో పడింది.