జమ్మూ కశ్మీర్‌లో ఘోర ప్రమాదం
- లోయలో పడ్డ బస్సు, 22 మంది మృతి
- మరో 30 మందికి తీవ్రగాయాలు
- రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి
శ్రీనగర్, ఏప్రిల్ 20: జమ్మూ కశ్మీర్‌లోని ఉద్ధంపూర్ జిల్లాలో సోమవారం ఉదయం పెనుప్రమాదం సంభవించింది. రామ్‌నగర్ నుంచి ఉద్ధంపూర్‌కు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు మూలమలుపు వద్ద లోయలో పడిపోవడంతో 22 మంది మరణించారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ ఘ టన సోమవారం ఉదయం దాదాపు 10 గంటలకు జరిగింది.
కొండప్రాంతంలో మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు బోల్తా పడి లోయలోకి దూసుకెళ్లింది. ప్రమా దం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు, సైన్యం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న బాధితులను హెలికాప్టర్ ద్వారా తరలించారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు వారు సానుభూతి తెలియజేశారు. ప్రధాని మోదీ ఈ ప్ర మాదం పట్ల విచారం వ్యక్తం చేశారు. బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించా రు. జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా బా ధితుల కుటుంబాలకు అండగా ఉంటామ న్నా రు.
లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అధికారులతో మాట్లాడి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అం దించాలన్నారు. మాజీ సీఎ మెహబూబా ముఫ్తీ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.






