ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఈశ్వరమ్మ
06-09-2025 12:07 AM
జహీరాబాద్, సెప్టెంబరు 5 :సంగారెడ్డి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఈశ్వర మ్మ ఎన్నికయ్యారు. గురుపూజోత్సవం సం దర్భంగా సంగారెడ్డి కలెక్టర్ చేతుల మీదు గా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు ను అందుకున్నారు. జరాసంగం మండలం కుప్పానగర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఈశ్వరమ్మ అ వార్డును దక్కించుకోవడంతో గ్రామ ప్రజ లు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






