వ్యూహాత్మకంగా రాణిస్తున్న ఎమ్మెల్యే యెన్నం
- ఆయన నిజాయితీకి సీవి ఆనంద్ క్షమాపణే నిదర్శనం
మహబూబ్ నగర్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): రాజకీయంపై ప్రజల మనోభావా లు ఎలా ఉన్నాయి... వారు ఏం ఆలోచిస్తున్నారు.. ఎలాంటి నాయకుడు కావాలని కో రుకుంటున్నారో అంచనా వెయ్యడంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి సాటిలేరు. మనిషికి పవర్ ముఖ్యం కాదు.. మంచి త నం ఉంటే చాలు చిరకాలం రాణిస్తామనే ధోరణిలో రాణిస్తూ అందరి మన్ననల్ని పొం దుకొంటున్నాడు యెన్నం.
ఇక ఇప్పుడు ని యోజకవర్గ అభివృద్ధితోపాటు, ప్రజల మ నోభావాలకు అనుగుణంగా ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ప్రతిపక్షాలను సైతం మిత్రపక్షాలు చేసుకొంటున్నాడు. దేశంలో పేరుగాంచిన వ్యూహాకర్తలుగా రాణిస్తోన్నా ప్రశాంత్ కిషోర్, సునీల్ కనుగోలు లాంటి వారు సైతం ఆలోచనలో పడేటట్లు చేస్తున్నా యి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి వ్యూ హాలు. నిత్యం ఆలోచనలతో వేస్తోన్నా అడుగులకు ఇప్పుడు ఏ వ్యూహాకర్త సాటిలేరనేది వినిపిస్తోన్నా మాట ఇది. తన పదునైనా వ్యూహాంతో రాజకీయాలే కాదు నియోజకవర్గ అభివృద్ధి చేపడుతూ, ప్రజల అంచనా లకు ధీటుగా రాణిస్తూ అందరివాడుగా పేరుతెచ్చుకొన్నారు. గతంలో బిఆర్‌ఎస్ పార్టీకి రెండుసార్లు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన స మయంలోనే రాజకీయంతోపాటు ప్రజల ఆలోచన విధానాలపై పూర్తి స్థాయి పట్టు సా ధించారని చెప్పొచ్చు.
ఆ తరువాత రాజకీ య మార్పుల దృష్ట్యా ఆ పార్టీని వీడి రాష్ట్ర ప్రజల ఆలోచనల్ని అంచనాలు వేసే పనిని వేగవంతం చేసుకొంటూ... పాలమూర్ నియోజకవర్గ ప్రజలపై ప్రత్యేక దృష్టిసారిస్తూ సమయం కోసం వేచి చూశారు. ఇక యెన్నం అనుకొన్నా సమయం రానే వచ్చిం ది. అది పాలమూర్ నియోజకవర్గాన్ని ఉప ఎన్నిక రూపంలో తన మైండ్కు పదునను పెట్టే సమయం వచ్చింది. ఆ వెంటనే కేవలం కొద్ది రోజుల్లోనే బిజెపి పార్టీ నుండి బరిలో దిగి అనూహ్యంగా గెలుపొందడంతో యావ త్తు అందర్ని ఆశ్చర్యాన్నికి గురిచేసింది. రెం డున్నర ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధితోపాటు, ప్రజలతో తన నడుచుకొన్నా విధా నం అందర్ని ఆకట్టుకొంది.
తన నిజాయితీతోపాటు, అభివృద్ధి కోసం చేసిన కృషిని ప్ర జల హృదయాల్లోకి వెళ్లాయి. ఆతరువాతజరిగిన ఎన్నికల్లో కేవలం కొద్దిపాటి తేడాతో ఓటమిపాలయ్యారు. పదేళ్ల కాలంలో రాజకీయంగా తన ఆలోచనలకు మరింత పదును పెట్టారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ నుండి కేవ లం నెల రోజుల వ్యవధిలోనే బరిలోకి దిగి ఎవ్వరు ఊహించని రీతిలో వ్యూహాత్మకంగా గెలుపొందారు. ఇప్పుడు వర్కింగ్ స్టైల్ని పూర్తిగా మార్చి అభివృద్ధిలో దూసుకుపోతున్నాడు. తానే ఒక వ్యూహాకర్త అనుభవంతో ప్రజల మనోభావాల్ని ఎప్పటికప్పుడు అంచనాలు వేస్తూ, వారికి కావాల్సిన అభివృద్దిని చేస్తూ వెళ్తుండడంతో కలుపుగోరు మనిషిగా ఒక ప్రత్యేక ముద్ర వేసుకొన్నారు. గతంలో ఏ రాజకీయ నేతకు రానీ క్రేజీని యెన్నం శ్రీనివాస్ రెడ్డి సొంతం చేసుకొన్నారనేది అందరు చెబుతోన్నా మాట ఇది.
విద్యాహాబ్ మహబూబ్ నగర్...
మహబూబ్ నగర్ లో విద్యను అన్ని విధాలుగా అభివృద్ధి చెయ్యాలన్నఉద్దేశ్యం తో ఎమ్మెల్యే అయిన ప్రారంభం నుండే ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. విద్య కు సహకరించే వారు ముందుకు రావాలని విద్యానిధిని ప్రారంభించారు. దానికి నియోజకవర్గ ప్రజల నుండి అనూహ్య స్పందన వచ్చింది. ఇక అన్ని ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్యతోపాటు, కావాల్సిన సదుపాయాల్ని సమకూరుస్తూ తనకంటూ ఒక ప్ర త్యేక స్థానం సంపాదించుకొన్నారు. ఇక సీ ఎం రేవంత్ రెడ్డి మన జిల్లా వాసే కావడంతో జిల్లాకు ’లా’ కాలేజీ, ట్రిపుల్ ఐటీ కళశాల, పాలమూర్ యూనివర్సిటీకి ప్రత్యేకంగా వందకోట్ల నిధులు తీసుకొచ్చి రాష్ట్రం లోనేజిల్లా విద్యహాబ్ పేరును తీసుకొచ్చారు.
సొంత నిధులతో ఉపాది శిక్షణ..
మహిళలు ఆర్థికంగా రాణించాలంటే వారికి ఉపాది శిక్షణలుఅవసరమని గుర్తించి న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తన సొం త నిధులతో నవరత్నాలు అనే కార్యక్రమం తో మహిళలకు ఉపాది శిక్షణను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు రెండు బ్యాచ్లు దాదా పు 600మందికి పైగా మహిళలు ఉపాది శిక్షణలు పూర్తి చేసుకొని ఆర్థికంగా రాణిస్తున్నారు. ఈ తరహా శిక్షణ కేంద్రాలు రాష్ట్రంలో నే మొదటిదని చొప్పొచ్చు. ఇంజనీరింగ్ విద్యలోనూ 100 మంది పేద విద్యార్థులకు ఉచితంగా తన సొంత నిధులను ఖర్చు చేసి చదివిపిస్తానని ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. నవరత్నాల సెంటర్ ఉపయోగా న్ని గుర్తించిన వారంతా యెన్నం శ్రీనివాస్ రెడ్డిని అభినందనలతో ముంచెత్తుతున్నారు.
మచ్చలేని నేతగా...
సొంతపార్టీ కానీ ప్రతి పక్ష పార్టీ అంటూ తేడా లేకుండా అందరితో స్నేహాభావంగా రాణిస్తూ ఒక మచ్చలేని నేతగా ముద్ర వేసుకొన్నాడు. ఎవ్వరు మాట్లాడినా ముందుగా విని ఆ తరువాతే సమస్యను పరిష్కరిస్తూ, అందరి మన్ననలు పొందుకొంటున్నాడు. ఇలా ఒకటేంటి అన్నింట్లో తనకంటూ ప్రత్యే క స్థానం సంపాదించుకొన్నా ఎమ్మెల్యే యె న్నం ఒక మచ్చలేని నేతగా రాణిస్తున్నాడు.
తన నిజాయితీకి సీవి ఆనందే క్షమాపణ చెప్పాడు
తాను ఎమ్మెల్యేనని గర్వం కానీ, ఆహాం కానీఎక్కడా ప్రదర్శించని యెన్నంకు ఇటీవలె ఒక చేదు అనుభవం ఎదురైంది. హైద్రాబా ద్ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ దగ్గరికి ఓ భూ మి సమస్య విషయాన్ని తీసుకెళ్లగా అతను పరిష్కరించకపోగా, ఆ మర్యాదగా ప్రవర్తించిన తీరును అసెంబ్లీ సభాహక్కుల సంఘం దృ ష్టికి తీసుకెళ్లాడు. దీంతో వెంటనే దిగి వచ్చిన పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ తన తప్పును తెలుసుకొని క్షమాపణలు చె ప్పారు. అధికారులపై వత్తిడి లాంటి పనులకు పూనుకోకుం డా వారు స్వేచ్చాయుత వాతావరణంలో పనిచేసేందుకు సహకరిస్తాడని ప్రభుత్వ అధికారు లు చెబుతోన్నా మాట ఇది. నియోజకవర్గ ప్రజలతోపాటు, పా ర్టీకి, ప్రభుత్వాన్నికి నేతలు, కార్యకర్తలకు అనుసంధానంగా ఉంటూ రాణి స్తూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకొన్నాడు ఎమ్మెల్యే యె న్నం శ్రీనివాస్ రెడ్డి. రానున్న రోజుల్లో పాలమూర్ నియోజకవర్గం పూర్తిస్థాయిలో రూ పురేఖలు మారడం ఖాయమని అందరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.






