calender_icon.png 6 September, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాసీల్దార్ కార్యాలయంలో అవినీతి జలగలు!

06-09-2025 12:07:12 AM

- దృవపత్రాలు, రిజిస్ట్రేషన్ల వ్యవహారాల్లో వసూళ్ల దందా

- ఏజెంట్ల అవతారంలో గ్రామీణ ప్రాంత లీడర్లు

- ఏసీబీ దాడుల నుంచి తప్పించుకునేందుకు కొత్త పంతా

- డబ్బులివ్వనిదే ఫైళ్ళు కదలని వైనం

-కాసుల వర్షం కురిపిస్తున్న రెవెన్యూ సదస్సు దస్త్రాలు

-పట్టించుకోని అధికారులు

-తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న గ్రామీణ ప్రజలు, రైతులు

 నాగర్ కర్నూల్ సెప్టెంబర్ 5 (విజయక్రాంతి) నాగర్ కర్నూల్ జిల్లాలోని తాసిల్దార్ కార్యాలయాల్లో గ్రామీణ ప్రాంత లీడర్లు ఏజెంట్లుగా మారి సామాన్యలు, రైతుల నుం డి అవినీతి జలగళ్ళా మారి అడ్డగోలుగా దో చుకుంటున్నారని ఆయా గ్రామీణ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కులం, ఆదాయ, స్థానిక ధ్రువపత్రాలు, భూమి క్ర యవిక్రయాలు పాత పహాణి దస్త్రాలు వంటి వాటితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా చేపట్టిన రెవెన్యూ సదస్సు ఫిర్యాదులు కూడా ఆయా తాసిల్దార్ కార్యాలయాలకు కాసుల వర్షం కురిపిస్తోంది.

ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు చిన్నచిన్న కొర్రీలు పెట్టి పనులు చేయకపోవడంతో వాటిని ఆసరాగా చేసుకున్న స్థానిక లీడర్లు తాము అధికారులతో మాట్లాడి పనులు జరిపిస్తామని కానీ కొంత డబ్బులు ఇవ్వాల్సి ఉం దంటూ బేరం కుదుర్చుకుంటున్నారు. భూ మి క్రయవిక్రయాల్లో ఒక్కో రిజిస్ట్రేషన్కు 6 నుండి 20వేల దాకా వసూళ్లు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రిజిస్ట్రేషన్ వ్యవహారంలో స్లాట్ బుక్ చేసే ఆన్లైన్ నిర్వాహకులు కూడా ఏజెంట్లుగా అవతారం ఎత్తుతున్నా రు. పట్టా పాస్ పుస్తకం లేకపోయినా, ఆధార్ కార్డులో పేర్లు తప్పొప్పులు, సర్వే నెంబర్లు భూమి హెచ్చుతగ్గులు, బ్యాంకు రుణాలు ఇతర చిన్నపాటి గెట్టు పంచాయతీలు వంటి వాటిని సాకుగా చూపి రెవెన్యూ ఇన్స్పెక్టర్లు వారి రిపోర్టుల కోసం నేరుగా రైతుల నుండి డబ్బులు అడగలేక కొంతమంది స్థానిక లీడర్లను పరోక్షంగా ఏజెంట్లుగా ఏర్పాటు చేసు కున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ దాడులు పెరుగుతున్న నే పథ్యంలో అధికారుల చేతికి మట్టి అంటకుం డా స్థానిక లీడర్లు పైరవీకారులతో వసూళ్ల దందాకు తెరలేపుతున్నట్లు ఆరోపణలు వె ల్లువెత్తుతున్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో ఉంచుకొని ఆశావాహులు పనులు చేపిస్తామంటూ ముందుకొచ్చి అధికారులతో భేరసారాలు చేస్తూ సామాన్యుల నుండి అడ్డగోలుగా డబ్బులు దండుకుంటున్నారని విమర్శలు బాహాటంగా వినిపిస్తు న్నాయి. ఒక్కో తాసిల్దార్ కార్యాలయంలో సుమారు 10 నుంచి 20 మంది దాకా ఇదే పైరవీ వ్యవహారాలు చూసుకునే ఏజెంట్లు దాపురించారని ఆయా గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు. 

నిర్లక్ష్యపు నీడలో తాసిల్దార్ కార్యాలయాలు..!

నాగర్ కర్నూల్ జిల్లాలోని తాసిల్దార్ కార్యాలయాలు పూర్తి నిర్లక్ష్యపు నీడలో కొనసాగుతున్నాయి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులు సామాన్యులను చులకనగా చూస్తూ కులం ఆదాయ స్థానిక దృవపత్రా లు ఇతర పట్టా భూదస్త్రాలు, పహానిలు వం టి వాటికోసం వచ్చే సామాన్యులను రైతులను అధికారులు చీదరించుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఒక్కో తాసిల్దార్ కార్యాలయంలో అధికారులు సిబ్బంది సు మారు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు కూ డా కార్యాలానికి హాజరు కావడం లేదని ఉదయం 10 గంటల నుంచి రాత్రిళ్ళు వరకు పడి కాపులు తప్పడం లేదని మండిపడుతున్నారు. ప్రతి సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కూడా పట్టించుకోకుండా ప్రజా సమస్యలను గాలికి వదిలేసారని ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. భూ క్రయవిక్రయాలు రిజిస్ట్రేషన్లు సైతం ఇస్తా రీతిగా వ్యవహరిస్తూ అడ్డగోలుగా డబ్బు సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. తరచూ పర్యవేక్షణ చేయాల్సిన ఉన్నతాధికారులు కూడా పట్టించు కోకపోవడంతో ఈ వ్యవహారం మరింత శృతి మించుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మా కార్యాలయంలో నిఘా పెంచాం.!

తెలకపల్లి తాసిల్దార్ కార్యాలయంలో కొంతమంది ఫైరవికార్లు రైతుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు మా దృ ష్టికి వచ్చింది. అలాంటి వారిపై నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటాం. మా దగ్గరికి వచ్చే రైతులకు సామాన్యులకు ఎవరికీ ఇబ్బందులు కలగకుండా చూ సుకుంటాం.

జాకీర్ అలీ, తాసిల్దార్, తెలకపల్లి, నాగర్ కర్నూల్ జిల్లా

ప్రతి తాసిల్దార్ స్థానికంగానే ఉండాలి.!

ప్రజలకు సేవలు అందించాల్సిన తా సిల్దార్లు ఆయా మండల కేంద్రాల్లోనే స్థానికంగా అందుబాటులో ఉండాలి . ప్రతిరోజు ఉదయం 10 గంటలకల్లా కా ర్యాలయ విధుల్లో ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ఎక్కడ ఎలాంటి అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకో వాలి. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. 

 అమరేందర్, అదనపు కలెక్టర్ రెవెన్యూ, నాగర్‌కర్నూలుజిల్లా