19 March, 2026 | 12:19 AM

ప్రాఫిట్ జాయింట్ కమిటీ చైర్మన్‌గా ఈటల

09-10-2024 01:59 AM

నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌కు కూడా చోటు

హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు కీలక పదవి లభించింది. పార్లమెంటుకు చెందిన ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ జాయింట్ కమిటీ చైర్మన్‌గా ఆయనను నియమించినట్లు లోక్‌సభ సెక్రటేరియేట్ ఉత్తర్వులు జారీ చేసింది. 15 మంది ఎంపీలతో కమిటీని నియమించారు. ఇందులో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు కూడా చోటు లభించింది.