22 May, 2026 | 10:24 AM

ఉద్యోగులపై ఈసీ నిఘా

20-04-2024 01:43 AM

l రాజకీయ పార్టీలతో అంటకాగితే.. ఇక అంతే!

l పార్టీ సమావేశాల్లో పాల్గొంటే కఠిన చర్యలు 

l ముందు షోకాజ్ నోటీసులు, ఆ తర్వాత సస్పెండే!

హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యా యులపై ఎలక్షన్ కమిషన్ (ఈసీ) డేగ కన్ను పెట్టింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకైనా, అభ్యర్థికైనా అనుకూలంగా వ్యవహరించే వారిపై అధికారులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. విచారణలో నిజమని తేలితే ఆయా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులిచ్చి వివ రణ తీసుకుంటున్నారు. విచారణలో ఏ పార్టీకైనా అనుకూలంగా వ్యవహరించినట్లు నిజమని తేలితే వారిని సస్పెండ్ చేసేందుకు కూడా వెనుకాడటం లేదు.

ఉద్యోగులు, ఉపాధ్యాయుల కదలికలను పసిగట్టేందుకు ప్రత్యేక యంత్రాంగం పనిచేస్తోంది. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే వారి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికా రులకు నివేదిస్తున్నారు. వ్యక్తిగత కదలికలే కాకుండా వారి సోషల్ మీడి యా ఖాతాలపైనా ఈసీ నిఘా పెట్టింది. ఎవరితో కలుస్తున్నారు? ఏదైనా పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారా? పార్టీ సమావేశాలు, విందులు వినోదాల్లో పాల్గొంటున్నారా? అని ఆరా తీస్తున్నారు. వీడియోలను తీసి పసిగడుతున్నారు. ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యా యులు, సంఘాల నేతల పాత్ర ఎప్పుడూ కీలకమే. రాజకీయ పార్టీల నాయకులతో వారికి సత్సంబంధాలు, మంచి పరిచయాలు ఉంటాయి.

ఉద్యోగ, ఉపాధ్యా యులు ఓటర్లను ప్రభావితం చేసేంత పలుకుబడి, పేరు ఉంటుంది. ఈ క్రమంలోనే రాజకీయ నాయకులు వారితో బృందాలుగా సమావేశాలను నిర్వహించే ప్రయత్నం చేస్తుంటారు. ఎన్నికల కోడ్ అమలు లో ఉన్నప్పుడు పార్టీ సమావేశా ల్లో పాల్గొనడం, అనుకూలంగా ప్రచారం చేయడం లాంటివి నిషేధం. వారం రోజు ల క్రితం ఖమ్మం జిల్లాలో ఓ హెడ్‌మాస్టర్ ఓ పార్టీ సమావేశంలో పాల్గొంటే, మరొక ఉపాధ్యాయుడు పేపర్‌లో ప్రకటన ఇచ్చినట్లు ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్లడంతో వారికి అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈనెల 7వ తేదీన సిద్ధిపేటలో ఓ పార్టీకి చెందిన ముఖ్యమైన నేత నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారనే కారణంతో దాదాపు వంద మం ది ఉద్యోగులపై అధికారులు చర్యలు తీసుకున్న విషయం తెలి సిందే.

వైరల్ అవుతున్న వీడియోలు

ఎన్నికల నేపథ్యంలో పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు విందులు ఇస్తుంటారు. వారిచ్చే విందులు, వినోదాలకు ఎవరికి తెలుస్తోందిలే.. అన్న నిర్లక్ష్యంతో కొందరు తెలిసీ తెలియక హాజరవుతున్నారు. 

ఈ క్రమంలో వారి ప్రత్యర్థులు కొందరు వీడియోలు తీసి కావాలనే సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోలు ఈసీ దృష్టికి వెళ్తుండటంతో విచారణ చేపట్టి ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో కొంత మంది కావాలనే మార్ఫింగ్‌లు చేస్తుం టే, మరికొంత మంది గిట్టనివారు కావాలని వీడియోలు తీసి వైరల్ చేస్తున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఏదీఏమైనా బలి అయ్యేది ఉద్యోగ, ఉపాధ్యాయులే కాబట్టి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని సహచరులను హెచ్చరిస్తున్నారు.