22 May, 2026 | 11:37 AM

‘మహానగర’ శివారులో భారీ వర్షం

20-04-2024 01:43 AM

ప్రధాన రహదారిపై నేలవాలిన వృక్షాలు

కిలోమీటర్ల స్తంభించిన ట్రాఫిక్

గంటల పాటు శ్రమించి ట్రాఫిక్‌ను క్లియర్ చేసిన పోలీసులు

హైదరాబాద్ సిటీబ్యూరో/కామారెడ్డి, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): మహానగర శివారులో శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వాన కారణంగా శ్రీశైలం ప్రధాన రహదారిపై సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ఇదే రహదారిలో భారీ వృక్షాలు నేలవాలాయి. అలాగే మహేశ్వరం మండలం తుమ్మలూరు కందుకూరు మధ్య ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు కొన్నిగంటల పాటు శ్రమించారు. రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం  ఉందని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. 

పిడుగుపాటుకు రైతు మృతి..

పిడుగుపాటుకు ఓ రైతు మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరులో జరిగింది. తెలిసిన వివరాల  ప్రకారం.. గ్రామానికి చెందిన మారమోని జంగయ్య (45) శుక్రవారం పొలం పనులకు వెళ్లాడు. సాయంత్రం ఉరుములు మెరుపులతో వర్షం ప్రారంభమైంది.  పిడుగు పడి జంగయ్య తీవ్ర అస్వస్థతకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు.

కామారెడ్డి జిల్లాలో పంట నష్టం

అకాల వర్షం రైతులకు నష్టాన్ని మిగిల్చింది. చేతికొచ్చిన పంటలను నేలవాల్చి ంది. కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి, రా మారెడ్డి,భిక్కనూరు, దోమకోండ, బీబీపేట, రాజంపేట్, సదాశివ నగర్, బిచ్కుంద, జుక్క ల్, మద్నూర్, బాన్సువాడ మండలాల్లో శుక్రవారం వడగండ్ల వాన కురిసింది. ధాన్యం సేకరణ కేంద్రాల్లోని రాశుల్లోకి నీరు చేరి కొ ంతమేర నష్టం వాటిల్లింది. మరికొన్నిచోట్ల కల్లాల్లోని ధాన్యంలోకి నీరు చేరింది. పలుచో ట్ల విద్యుత్ స్తంభాలు నేలవాలాయి. పంట నష్టం వాటిల్లిన ప్రాంతాల్లో అధికారులు పర్యటించి, నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు.