1 August, 2026 | 5:50 PM

Breaking News

వరదలు సాధారణ స్థితికి వచ్చే వరకు పునరావాస కేంద్రాల్లోనే ముంపు బాధితులు తల దాచుకోవాలి   •   అడ్మిషన్ పేరుతో విద్యార్థుల నుండి పైసలు వసూలు   •   సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ క్రాంతి   •   నవజాత శిశువుకు తల్లిపాలే రక్షణ కవచం   •   ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం   •   ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలి   •   రిఫీలింగ్ సెంటర్లపై దాడి.. 16 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం   •   అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలి   •   విద్యార్థులకు అండగా నిలబడడమే 'యూత్ ఫర్ సేవ' లక్ష్యం   •   కోనరావుపేట మండలంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీల ఏర్పాటు   •  

40 ఎకో టూరిజం స్పాట్లు గుర్తింపు

22-06-2024 09:47 PM

హైదరాబాద్ : ఎకో టూరిజంపై అటవీశాఖ మంత్రి కొండా సురేఖ సమీక్షించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎకో టూరిజం అభివృద్ధి కోసం సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామనన్నారు. అందుకోసం రాష్ట్రంలోని 12 సర్క్యూట్ లలో 40 ఎకో టూరిజం స్పాట్లను గుర్తించినట్లు ఆమె తెలిపారు. ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న ఎకో టూరిజం విధానాలపై  అధ్యయనం చేసి పీపీపీ విధానంలో ఎకో టూరిజం అభివృద్ధికి నిధులను సమీకరించినట్లు కొండా సురేఖ వెల్లడించారు. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీకి మంత్రి కొండా సురేఖను ఛైర్మన్ గా.. మరో 16 మంది అధికారులను సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.