1 August, 2026 | 4:44 PM

ఎన్డీఏ డైరెక్టర్ జనరల్ తొలగింపు.. బాధ్యతలు ఎవరికంటే..!

22-06-2024 10:09 PM

న్యూఢిల్లీ : దేశంలో వైద్యవిద్య కోర్లులో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ - యూజీ 2024 పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుభోద్ కుమార్ ను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్డీఏ డైరెక్టర్ జనరల్ గా ప్రదీప్ సింగ్  ఖరోలాకు అదనపు బాధ్యతలు అప్పగించింది. నీట్, నెట్ పరీక్ష నిర్వహణ విషయంలో ఎన్టీఏపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పేపర్ లీకేజ్ వల్ల ఇప్పటికే యూజీసీ నెట్ ను రద్దు చేసింది.