10 June, 2026 | 1:32 AM

పినరయి కుమార్తె వీణకు ఈడీ సమన్లు

10-06-2026 12:00 AM

మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారులిద్దరికీ నోటీసులు

తిరువనంతపురం, జూన్ 9: కేరళం మాజీ సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణ, కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్‌ఏ హారిస్ ఇద్దరు కుమారులకు ఈడీ మంగళవారం సమన్లు జారీ చేసింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ అక్రమ లావాదేవీల్లో వీణ ప్రమేయం ఉన్నట్లుగా ఆరోప ణలు రావడంతో కంపెనీల చట్టం ఉల్లంఘన కింద వీణపై అభియోగాలు నమోదయ్యా యి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం కొచ్చి కార్యాలయం ముందు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది.

వీణతో పాటు కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్  లిమిటెడ్‌కు సంబంధించిన మరో తొమ్మిది మందికి సమన్లు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారులు డిజిటల్ కరెన్సీ అక్రమ లావాదేవీలు, క్రిప్టో ద్వారా డబ్బును అక్రమంగా తరలించారని దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కుమారులి ద్దరి వాంగ్మూలాలను నమోదు చేయడానికి, వారి బ్యాంకు ఖాతాలు, డిజిటల్ వాలెట్లను దర్యాప్తు చేయడానికి సమన్లు జారీ చేశారు. 

ఈడీతో కీలక పత్రాలను పంచుకోవడానికి నిరాకరిస్తూ కంపెనీ దాఖలు చేసిన పిటి షన్‌ను కార్పొరేట్ నేరాలను విచారించే ప్రత్యేక న్యాయస్థానం ఇటీవల తిరస్కరించిం ది. ఈ క్రమంలోనే ఈడీ దర్యాప్తును ము మ్మరం చేసింది. ఈ దర్యాప్తులోభాగంగా ఇప్పటికే పలు డాక్యుమెంటరీ, డిజిటల్, ఆర్థిక ఆధారాలను సేకరించినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు వీణపై కా ర్పొరేట్ వ్యవహారాల శాఖ దర్యాప్తు చేపట్టింది.

ఆమె నేతృత్వంలోని ఎక్సాలాజిక్ సొ ల్యూషన్‌కు కొచ్చిన్ మినరల్స్ అండ్ రిటైల్స్ రూ.2.78 కోట్లు చెల్లించడంపై అనుమానాలు లేవనెత్తింది. సాఫ్ట్‌వేర్, స్కూల్ మేనేజ్ మెంట్  సాఫ్ట్‌వేర్లను తయారుచేసే ఎక్సాలాజిక్ ఎటువంటి సర్వీసు లేకుండానే లిస్టెడ్ కంపెనీ అయిన సీఎంఆర్‌ఎల్‌కు చెల్లింపులు చేయడాన్ని ప్రశ్నించింది.

కెఎంఆర్‌ఎల్ సం స్థ ఎక్లాసిజిక్ సొల్యూషన్‌కు రూ. 2.73 కో ట్లు చెల్లించింది. ఎలాంటి ఐటీ సేవలు అం దించలేదు. ఈ విషయం 2023లో వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి లో దర్యాప్తు చేయాలని కేంద్రం ఆదేశించింది.