12 అణ్వస్త్రాల మోహరింపు
- భారత అణు విధానంలో కీలక మార్పు
- 180 నుంచి 190కి చేరిన అణ్వస్త్రాల సంఖ్య
- ‘సిప్రి’ నివేదికలో సంచలన విషయాలు
న్యూఢిల్లీ, జూన్ ౯: భారతదేశ రక్షణ విభా గం తన అణ్వస్త్ర విధానంలో కీలక మార్పు లు చేసింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 12 అణ్వస్థ్రాలను రహస్య ప్రాం తాల్లో మోహరింపజేసింది. స్వతంత్ర భారత చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో అణ్వస్త్రాలను కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో మో హరింపజేయడం ఇదే తొలిసారి. అలాగే, ఒక్క ఏడాదిలోనే భారత అణ్వస్త్రాల సంఖ్య 180 నుంచి 190కి పెరిగిందని కూడా నివేదిక వెల్లడించింది.
స్వీడన్ ఆయుధ నిఘా సంస్థ అయిన స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిప్రి) తాజాగా విడుదల చేసిన ఓ నివేదికలో ఈ విషయాలు బయటికొచ్చాయి. దశాబ్దాలుగా అనుసరిస్తున్న వ్యూహాన్ని పక్కనపెట్టి.. భారత ప్రభు త్వం కొత్త సైనిక ఎత్తుగడలు వేయడం అంతర్జాతీయంగా ప్రాధాన్యతను సంతరించు కుంది. పొరుగు దేశమైన పాకిస్తాన్ వద్ద 170 అణ్వస్త్రాలు ఉండగా, మరో పొరుగు దేశమైన చైనా వద్ద 620 అణ్వస్త్రాలు ఉన్నా యి. భారత్ తాజా ఎత్తుగడ గట్టి జవాబు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.






