డంపింగ్ యార్డ్ తరలింపు వ్యతిరేక ఉద్యమాన్ని ఆపలేరు: ఎంపీ ఈటెల రాజేందర్
అరెస్టులతో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ తరలింపు వ్యతిరేక ఉద్యమాన్ని ఆపలేరు.... ఎంపీ ఈటెల రాజేందర్
శామీర్ పేట్,జులై 11(విజయక్రాంతి): జవహర్‌నగర్ డంప్‌యార్డ్(Jawaharnagar Dump Yard) సమస్యపై నిరసనకు దిగిన పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని శామీర్ పేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నాయకుల అరెస్ట్ విషయాన్నీ తెలుసుకున్న మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి అరెస్ట్ అయినా వారికీ మద్దతు తెలిపారు.
ఈ సందర్బంగా ఎంపీ మీడియా తో మాట్లాడుతూ..... డంప్‌యార్డ్ కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. జవహర్ నగర్, దమ్మాయిగూడ, బాలాజీనగర్, కీసర, ఘట్ కేసర్ ప్రాంతాల్లోని భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయన్నారు. ఇక్కడి నుండి ఎంపిగా గెలిచిన రేవంత్ రెడ్డి డంపింగ్ యార్డు కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో కేసు వేశాడని గుర్తు చేశారు. ఇప్పుడు సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి ఎందుకు అడ్డుకుంటలేదని ప్రశ్నించారు. డంపింగ్ యార్డు కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారిని అక్రమంగా అరెస్టు చేయడం దారుణం అన్నారు. జవహర్ నగర్ ప్రజల తరుపున నిరసనను అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని ఆయన పేర్కొన్నారు.






