calender_icon.png 6 December, 2024 | 3:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత

18-09-2024 04:04:11 AM

  1. నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు 
  2. నాలాలపై నిర్మాణాలను ఉపేక్షించబోం 
  3. జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాలు 
  4. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి

హనుమకొండ, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అ ధిక ప్రాధాన్యతనిస్తోందని, వీటి నిర్వహణ లో నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు తీసుకుంటామని రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం హనుమ కొండ కలెక్టరేట్‌లో వరంగల్ నగర అభివృద్ధిపై అధికారలుతో ఆయన సమీక్షా సమావే శం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్ తర్వాత రెండో అతి పెద్ద నగరమైన వరంగల్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని, అందుకే తనకు ఈ జిల్లా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారన్నారు. ఈ మేరకు నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. స్మార్ట్‌సిటీ నిధులు విడుదలయ్యేందుకు కృషి చేస్తానన్నారు. 

పేదలకు పెద్దదిక్కుగా ఎంజీఎం 

పేదలకు పెద్దదిక్కుగా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఉన్నదని మంత్రి పొంగులేటి అన్నారు. అలాంటి ఆసుపత్రిలో మందుల కొరత రాకుండా అధికారులు చూసుకోవాలని చెప్పారు. నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. జిల్లాలని ఆసుపత్రులను ఎమ్మెల్యేలు తరచుగా పర్యవేక్షించాలని సూచించారు. ఎంజీ ఎంలో రోగులకు మెరుగైన వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

ఎంజీ ఎం ఆసుపత్రిలో ఫిర్యాదులను స్వీకరించి వాటికి సంబంధించిన నివేదికను అందించాలని కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. వరద ముప్పు నుంచి ప్రజలను కాపాడినందుకు హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు, అధికారులను మంత్రి అభినందించారు.

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు

పాత్రికేయులకు ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. గత ప్రభుత్వం పాత్రికేయులకు ఇళ్ల స్థలాల విషయంలో కాలయాపన చేసిందన్నారు. అర్హు ల జాబితాను ఆయా కమిటీలు అందిస్తే ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు

నాలాలపై నిర్మాణాలను ఉపేక్షించొద్దు

నాలాలపై ఎలాంటి నిర్మాణాలు ఉన్నా ఉపేక్షించొద్దని, ఎంతటి వారైనా అధికారులు చర్యలు తీసుకోవాలని పొంగులేటి ఆదేశించారు. నాలాలపై నిరుపేదల ఇళ్లు ఉంటే వారికి మరోచోట నివాస కల్పించాలనారు. ప్రభు త్వ భూమిని ప్రభుత్వమే తీసుకుంటుందని, ఎంత పెద్దవాళ్లు తీసుకున్న ప్రభుత్వం ఊరుకోదన్నారు. కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పను లు త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కళాక్షేత్రాన్ని వ చ్చే నెల 2న సీఎం సందర్శిస్తారని చెప్పారు. సమావేశంలో మంత్రి కొండా సురేఖ, మే యర్ గుండు సుధారాణి, ఎంపీ కడియం కా వ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆ ర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, కలెక్ట ర్లు సత్యశారదా, ప్రావిణ్య, అదనపు కలెక్టర్లు వెంకట్ రెడ్డి, సంధ్యారాణి పాల్గొన్నారు. 

ఎంజీఎంలో ప్లేట్‌లెట్  కౌంట్ మిషన్ ప్రారంభం

ఎంజీఎం ఆసుపత్రిలో రూ.41 లక్షలతో ఏర్పాటు చేసిన సింగిల్ డోనర్ ప్లే ట్‌లెట్ కౌంట్ మిషన్‌ను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ మంగళవారం ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఆసుపత్రిలోని పలు విభాగాల ను సందర్శించి రోగులతో మాట్లాడి వై ద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నా రు. అనంతరం కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలోని పీఎంఎస్‌ఎస్‌వై ఆసు పత్రిలో 14 పడకలకు అప్‌గ్రేడ్ చేసిన డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించారు.

అదనంగా మరో 10 డయాలసిస్ పడకల యూనిట్లను మంజూరు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. కాకతీయ మెడికల్ కళాశాలలో అంతర్గత రోడ్ల ప నులను మంత్రులు ప్రారంభించారు. మ ంత్రుల వెంట ఎంపీ కడియం కావ్య, న గర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మె ల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, కలెక్టర్ డాక్టర్ సత్య శారదా ఉన్నారు.