17 April, 2026 | 8:17 AM

పాఠశాలలను తనిఖీ చేసిన విద్యాశాఖ ఆర్జేడీ

26-06-2025 11:26 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): పాఠశాల విద్యాశాఖ వరంగల్ ఆర్జెడి సత్యనారాయణ రెడ్డి(RJD Satyanarayana Reddy) గురువారం మహబూబాబాద్ జిల్లాలోని వివిధ పాఠశాలలను తనిఖీ చేశారు. బ్రాహ్మణపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి విద్యాబోధన తీరు, బేస్ లైన్ పరీక్షల నిర్వహణ ను పరిశీలించారు. గణితం, ఇంగ్లీష్ సబ్జెక్టుల పరంగా పలు ప్రశ్నలు వేసి విద్యార్థుల నుంచి సమాధానాలను రాబట్టి విద్యాబోధన తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్నం భోజనం, పాఠశాల ఆవరణను పరిశీలించారు. ఆర్ జెడి వెంట జిల్లా విద్యాధికారి డాక్టర్ ఏ. రవీందర్ రెడ్డి, క్వాలిటీ కోఆర్డినేటర్ ఆజాద్ చంద్రశేఖర్, హెడ్మాస్టర్ బద్రు నాయక్ తదితరులున్నారు.