ఉపాధ్యాయులకు విద్యాశాఖ డైరెక్టర్ ప్రోత్సాహం
02-03-2026 01:04 AM
తెలంగాణ గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ అసోసియేషన్
హైదరాబాద్, మార్చి 1 (విజయక్రాంతి): ప్రధానోపాధ్యాయుల సేవలను ప్రోత్సహిస్తూ, పదవీ విరమణ రోజు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ప్రశంసాపత్రాలు అంజేయడమనేది శుభపరిణామని తెలంగాణ గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.రాజభాను చంద్ర ప్రకాశ్, ప్రధాన కార్యదర్శి హేమచంద్రుడు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ నూతన స్ఫూర్తిదాయక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందు కు డైరెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నిస్వార్థంగా సేవలందిస్తున్న పాఠశాల స్థాయి ప్రధానోపాధ్యాయుల, ఉపా ధ్యా యుల సేవలను గుర్తించి అధికారికంగా ప్ర శంసించడం ద్వారా మిగతా టీచర్లలో నూతనోత్సాహాన్ని నింపి మరింత అంకితభావంతో పనిచేసే అవకాశముంటుందన్నారు.




