ప్రతి చిన్నారి భవిష్యత్తుకు విద్య బలమైన పునాది
- ఎస్పీ రోహిత్ రాజు
- బక్కచింతలపాడులో నూతన స్కూల్ ప్రారంభం
చర్ల ,జులై 22, (విజయక్రాంతి): ప్రతి చిన్నారి పునాదికి విద్య ఎంత అవసరమని ఎస్పి రోహిత్ రాజు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బక్కచింతల పాడులో చర్ల పోలీసుల ఆధ్వర్యంలో ని ర్మించిన ఎంపీపీఎస్ భవనాన్ని బుధవారం ఎస్పీ రోహిత్ రాజు ప్రారంభించారు. పాఠశాలలోని విద్యార్థిని,విద్యార్థులకు స్కూల్ బ్యాగులను, పలకలను పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులతో సమావేశమై పలు అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ విద్య అనేది ప్రతి చిన్నారి భవిష్యత్తుకు బలమైన పునాది అని పేర్కొన్నారు. మారుమూల గిరిజన ప్రాం తాల్లోని చిన్నారులు కూడా నాణ్యమైన వి ద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపా లని సూచించారు. ఈ కార్యక్రమంలో భ ద్రాచలం డిఎస్పి అరుణ్ కుమార్, ఎస్బి 2 ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, చర్ల సీఐ రాజు వర్మ, ఎస్త్స్రలు నర్సిరెడ్డి, కేశవ, యంఈఓ రమణ, సర్పంచ్ లక్ష్మి, ఉపాధ్యాయురాలు సౌజన్య, తదితరులు పాల్గొన్నారు.






