23 July, 2026 | 1:54 AM

బైక్ టాక్సీలకు ఏకీకృత నియంత్రణ అవసరం

23-07-2026 12:00 AM

కట్స్ నివేదికలో వెల్లడి

ముషీరాబాద్, జూలై 22 (విజయక్రాంతి):  బైక్ టాక్సీలకు దేశ వ్యాప్తంగా ఏకీకృత, సాక్ష్యాధారిత నియంత్రణ చట్రం అవసరమని కట్స్ ఇంటర్నేషనల్ నివేదికలో వెల్లడైందని కట్స్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. బుధవారం వారు మాట్లాడుతూ ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఆర్థిక వ్యవహారాల అధికార ప్రతినిధి గోపాల్ కృష్ణ అగర్వాల్ నివేదికను ఆవిష్కరించగా, జాతీయ రహదారి భద్రతా బోర్డు ఛైర్మన్ నితిన్ ఆర్.గోకర్ణ్ ప్రసంగించారని తెలిపారు.

రవాణాయేతర బైక్లకు షరతులతో అనుమతి, ప్లాట్ఫామ్ ఆధారిత జవాబుదారీతనం, ఏకీకృత భద్రతా ప్రమాణాలు, బీమా, హెల్మెట్, పారదర్శక ఛార్జీలు, ప్రోత్సాహకాలతో ఈవీ మార్పును సిఫార్సు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమోల్ కులకర్ణి, ఛవి బన్స్ వాల్, పరోమా భట్, ప్రవేశ్ బియాని, శాంతను శర్మ, నిఖిల్ రాఠీ, అనిల్ శశి, వీరేంద్ర ఎస్. రాథోర్, శిక్షా శ్రీవాస్తవ, శ్రేయా యాదవ్, సౌరవ్ ధర్ పాల్గొన్నారు.