విద్యార్థులకు న్యాయం చేయాలి
- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
- సనత్‌నగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ
- ఛలో లోక్‌భవన్ కార్యక్రమంలో పాల్గొన్న నీలిమ
సికింద్రాబాద్, జూలై 22 (విజయక్రాంతి): టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్‌న గర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ కోట నీలిమ న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగినట్లు వెల్లడైన పోలీసు చర్యను తీవ్రంగా ఖండిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆమె పేర్కొన్నారు.
దేశ భవిష్యత్తు అయిన విద్యార్థుల గొంతును అణచి వేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదని అన్నారు. విద్యార్థులకు మద్దతుగా నిరసన వ్యక్తం చేసిన లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు ఇతర ప్రతిపక్ష నాయకులపై జరిగినట్లు వెల్లడైన పోలీసు చర్యను ఆమె తీవ్రంగా ఖండించారు. ఏఐసీసీ పిలుపు మేరకు, టీపీసీసీ అధ్యక్షులు బి.మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన చలో లోక్ భవన్‌కార్యక్రమంలో డాక్టర్ కోట నీలిమ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు సంఘీభావంగా నిరసన తెలుపుతూ గవర్నర్ నివాసం వద్ద ఆమెతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ విద్యార్థులకు లాఠీలు కాదు, న్యాయం కావాలి. పోటీ పరీక్షల విశ్వసనీయతను కాపాడాల్సిన బా ధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. విద్యా వ్యవస్థలో నెలకొన్న సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి.నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు పూర్తి న్యాయం జరిగే వరకు, బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుందని డాక్టర్ కోట నీలిమ స్పష్టం చేశారు.






