సమగ్ర అభివృద్ధికి విద్య మూలం
ఎంజీయు వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్
నల్లగొండ టౌన్, మే 12: సమగ్ర అభివృద్ధికి విద్యనే మూలమని మహాత్మా గాంధీ యూనివర్సిటీ వి సీ కాజా ఆల్తాఫ్ హుస్సేన్ అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఎంజియూ లో నిర్వహించిన విద్యా విధానంపై ఆయన మాట్లాడారు దేశ సమగ్ర అభివృద్ధికి మూలo విద్యనే అన్నారు . సరియైన ప్రణాళికతో పరిశోధనలపై దృష్టి సారించలన్నారు.
ఓయూ రిటైడ్ ప్రొపిసర్ శివారెడ్డి మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం 2020 సమగ్రమైన మార్పులను సూచిస్తుందని, బాల్యం నుండే బలమైన పునాదులుగా విద్యను అందించే ప్రణాళిక, విద్యార్థులు ఐక్యక అంశాలను ఎంచుకునే విసులుబాటు, జవాబుదారితనం, నాణ్యత ప్రమాణాలపై సంస్థలు దృష్టి సారించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం స్థాపించిన మొదటి విద్యా కమిషన్ వెలువరించిన రాష్ట్ర విద్యా విధానాన్ని వివరించారు . విద్యను కేవలం మార్కులు, సర్టిఫికెట్లు, ర్యాంకులు వంటి బాహ్య ప్రమాణాల ఆధారంగా మాత్రమే అంచనా వేయడం సమాజానికి హానికరమన్నారు. విద్య యొక్క అంతర్మూల్యము జ్ఞానం, విమర్శనాత్మక ఆలోచన, నైతిక బలం, సామాజిక బాధ్యత వంటి అంతర్గత మార్పులుగా పేర్కొన్నారు.
ప్రభుత్వం, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు విద్యలో బాహ్య విలువల కన్నా అంతర్మూల్యానికి ప్రాధాన్యం ఇచ్చే విధానాలు, పద్ధతులు అమలు చేయాలన్నారు. ఆడిట్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, ఆడిట్ సెల్ డైరెక్టర్ డా వై ప్రశాంతి, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య రేఖ, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య శ్రీదేవి వివిధ కళాశాల ప్రిన్సిపాల్ అధ్యాపకులు పాల్గొన్నారు.






