14 April, 2026 | 1:59 PM

అనుమతులు లేని ప్రైవేటు పాఠశాలకు తాళం వేసిన విద్యాశాఖ అధికారులు

25-06-2025 04:58 PM

చండూరు (విజయక్రాంతి): చండూరు మండల కేంద్రంలో లిటిల్ ఫ్లవర్ సీబీఎస్ఇ ఇంటర్నేషనల్ స్కూల్(Little Flower CBSE International School)కు ఎలాంటి అనుమతులు లేవని సీఎం ఓ కే. రవీందర్, మండల విద్యాశాఖ అధికారి వి. సుధాకర్ రెడ్డి పాఠశాల సందర్శించి ఆ పాఠశాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... చండూరు మండల కేంద్రంలో విద్యాశాఖ అనుమతులు లేకుండా ప్రైవేటు పాఠశాలలను నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు.

ఈ మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాల రికార్డులను పరిశీలించి అనుమతులు లేనందున ఈ పాఠశాలను మూసివేస్తున్నామని వారన్నారు. ఈ పరిసర ప్రాంతాలలో ప్రతి తల్లిదండ్రుల వారి పిల్లలను ఇలాంటి పాఠశాలలో చదవడం వలన ఎలాంటి టీసీలు, సర్టిఫికెట్ గాని పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని, పాఠశాలలో ఎవరు కూడా అడ్మిషన్ పొందవద్దని వారన్నారు. గత సంవత్సరం నుండి విద్యా శాఖ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా నడిపారని వారు  అన్నారు.