11 March, 2026 | 11:19 PM

చదువుకుంటేనే సమాజంలో ఉన్నత స్థానం

11-03-2026 07:51 PM

అసిస్టెంట్ లేబర్ కమిషనర్ నితిన్ రెడ్డి

నిర్మల్,(విజయక్రాంతి): విద్యారంగంలో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ప్రతి విద్యార్థి బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ అధికారి  ముత్యంరెడ్డి అన్నారు. బుధవారం నిర్మల్ పట్టణంలోని వాసవి ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు కెరీర్ గౌడ్స్ పై అవగాహన కల్పించారు. పదవ తరగతి విద్యార్థిలకు ఎంతో కీలకమైందని గుర్తు చేశారు. పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో వాసవి విద్యాసంస్థల సెక్రటరీ జగదీష్ రెడ్డి, కరాస్పాండెంట్  పోతారెడ్డి, అడ్వయిజర్ మోహన్ రెడ్డి, లేబర్ అసిస్టెంట్ కమీషనర్ ముత్యంరెడ్డి, ప్రిన్సిపాల్స్ రాజ్ కుమార్, శ్రీనివాస్ శెట్టి, శైల జాయ్ సన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గోన్నారు.