30 May, 2026 | 1:48 AM

విద్యాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

30-05-2026 12:00 AM

ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి

జడ్చర్ల, మే 29: విద్యాభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తుందని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పాత బజార్ బాదేపల్లిలో సీఎస్‌ఆర్ ఫౌండేషన్ అరబిందో ఫార్మా సౌజన్యంతో నిర్మించనున్న హరిజనవాడ ప్రాథమిక పాఠశాల భవనానికి శుక్రవారం జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా తో పాటు అరబిందో ఫార్మా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే  జనంపల్లి అనిరుద్ రెడ్డి  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి  మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు సీఎస్‌ఆర్ సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేస్తున్నాయని అన్నారు. హరిజనవాడలో నిర్మించనున్న ఈ నూతన పాఠశాల భవనం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, అరబిందో ఫార్మా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.