ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి
వాకిటి శ్రీహరి
నారాయణపేట జిల్లాలో విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తా
జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక
నారాయణపేట.మే 29(విజయక్రాంతి) : తెలంగాణ ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి అల్పాహారము, కిట్టు విద్యార్థులకు అందజేయడం అభినందనీయం పి అర్ టి యు టిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పులగం దామోదర్ రెడ్డి ఈరోజు పి ఆర్టియుటిఎస్ నారాయణపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో 2025 -26 పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన జిల్లాలోని ప్రభుత్వ అన్ని యాజమాన్యంలోని ప్రతి పాఠశాల మొదటి, రెండవ స్థానంలో నిలిచిన విద్యార్థులను ఈ ఫలితాలు సాధించుటకు కృషిచేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందమును మెడల్స్,సర్టిఫికెట్, మెమొంటోలు లతో ఘనంగా జిల్లా కేంద్రంలోని అంజన గార్డెన్ లో పి ఆర్ టి యు టి ఎస్ జిల్లా అధ్యక్షులువై.జనార్దన్ రెడ్డి గారి అధ్యక్షతన సన్మానించారు.
ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి గారు మాట్లాడుతూ మన జిల్లా ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యాభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. విద్యాశాఖ చాలా కీలకమైన శాఖ అని అందుకే ముఖ్యమంత్రి గారు తన దగ్గరే ఆ శాఖను ఉంచుకొని ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు ఎప్పటికప్పుడు చేసేలా చూస్తున్నారని అన్నారు.
ఇప్పటికీ ఉద్యోగ,ఉపాధ్యాయులకు రావలసిన పి.ఆర్.సి, డిఏలు, పెండింగ్ బిల్లులుల వంటి సమస్యలు పరిష్కారం అయ్యేలా కృషి చేస్తాను అన్నారు. ఈ కార్యక్రమం చాలా అద్భుతమైనదని కితాబు ఇస్తూ జిల్లా కలెక్టర్ గారికి పిఆర్టియు ఆధ్వర్యంలో అవార్డు పొందిన ఇద్దరు విద్యార్థుల ఫ్లెక్సీలను తయారుచేసి అన్ని పాఠశాలల్లో పెట్టాలని వాటిని స్ఫూర్తిగా తీసుకొని వచ్చే విద్యా సంవత్సరం విద్యార్థులు పిఆర్టియు అవార్డు తీసుకోవడానికి ఉత్సాహంతో చదివేలా ప్రేరణ కలిగించాలని సూచించారు.
కలెక్టర్ సిహెచ్ ప్రియాంక మాట్లాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు జిల్లాలో విద్యార్థుల నమోదుకు మరియు గుణాత్మక విద్యకు ఉపాధ్యాయులు కృషి చేస్తూ ఉండాలని వారి సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తాను అన్నారు జిల్లాలో అక్కడక్కడ బాల్యవివాహాలు జరుగుతున్నాయని వాటినరికట్టడానికి అందరూ సహకరించాలని అన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో నాలుగైదు పాఠశాలలు 100% ఫలితాలు సాధిస్తే కేవలం నేడు ఒక్క నారాయణపేట జిల్లాలోనే 38 పాఠశాలలు 100% సాధించడము అభినందనీయమని,
అదే విధంగా ప్రతి పాఠశాలలోని విద్యార్థులను ఉపాధ్యాయులను ప్రోత్సహించడానికి నిర్వహిస్తున్న జిల్లా శాఖను అభినందిస్తూ పలు ఉపాధ్యాయ సమస్యల మీద మాట్లాడారు రాష్ట్ర సంఘ అధ్యక్షులు పులగం దామోదర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ కిట్ వంటి సౌకర్యాలు అందజేస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా నారాయణపేట జిల్లా శాఖ జిల్లాలో ఉపాధ్యాయుల కొరత ఉన్న కారణంగా విద్య వాలంటీర్స్ ఇవ్వాలని విద్యాశాఖ కార్యాలయానికి తగిన సిబ్బందిని కేటాయించాలని, కారుణ్య నియామకాలను చేపట్టాలని, హెల్త్ కార్డులు కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరులో అమలు అయ్యేలా చూడాలని కోరారు.
పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు పేరి వెంకట్ రెడ్డి,ఆడిట్ కమిటీ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కొండ శ్వేతా సత్య యాదవ్,జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ గోవిందరాజు,TNGO జిల్లా అధ్యక్షులు ఎం.నర్సింహా రెడ్డి,పి ఆర్ యు టి ఎస్ నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శి పి వెంకట్ రెడ్డి గౌరవాధ్యక్షులు తిరుపతి మాజీ జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సుదర్శన్ రావు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రాజ్ కుమార్ జిల్లా సెక్టోరియల్ అధికారులు , విద్యాసాగర్ రాజేంద్ర కుమార్ నాగార్జున రెడ్డి శ్రీనివాసు జిల్లాలోని వివిధ మండలాల విద్యాధికారులు
నిజాముద్దీన్ ఆంజనేయులు కృష్ణారెడ్డి అమీరొద్దీన్ జనార్దన్ రెడ్డి జిహెచ్‌ఎంలు ఉన్నత పాఠశాలల HM లు వివిధ మండలాల పిఆర్టియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏం రఘువీర్, జనార్ధన్, గోవర్ధన్, నరసింహారెడ్డి,రమేష్,భాస్కర్, సూర్యప్రకాష్, గోపాల్ రెడ్డి, బాబు, దండు శేఖర్, బలరాం,తిమ్మన్న,వెంకటేష్,హరీష్ ముస్తఫా, కిష్టయ్య,ప్రకాష్ గౌడ్, అనంతయ్య, శ్రీకాంత్,శ్రీనివాస్, భీమేష్ కార్యకర్తలు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






