11 July, 2026 | 2:52 AM

విద్యాసంస్థల బంద్ విజయవంతం

11-07-2026 01:52 AM

ములకలపల్లి, జూలై 10 (విజయక్రాంతి): పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలు, బకాయిలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ మండల నాయకులు ముదిగొండ ప్రశాంత్, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు తెల్లం అఖిల్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ లో భాగంగా శుక్రవారం ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా ముదిగొండ ప్రశాంత్ మాట్లాడారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు నడుస్తున్నప్పటికీ రాష్ట్రంలో అత్యంత కీలక శాఖ విద్యా శాఖకు మంత్రిని నియమించకపోవడం వల్ల విద్యా వ్యవస్థ దయనీయంగా మారిందని ఆరోపించారు.

విద్యా శాఖకు మంత్రిని వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. 27 వేల పాఠశాలలను 4 వేలకు కుదించాలనే ఆలోచనను తక్షణమే మానుకోవాలని డిమాండ్ చేశారు.  విద్యా సంస్థలలో ర్యాగింగ్ నిరోధక, డ్రగ్స్ నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు.విద్యా హక్కు చట్టం అమలు చేసి,పేద విద్యార్థులకు 25 శాతం విద్యార్దులకు ఉచిత ప్రేవేశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శరత్ కళ్యాణ్,సంజయ్,శేఖర్,నాగ చైతన్య,నిశాంత్,దీపు వంశీ,సాంబ, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.