21-02-2026 12:38:34 AM
పోలీస్ కమిషనర్ సునీల్ దత్
ఖమ్మం టౌన్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): ప్రయత్నమే విజయానికి మార్గమని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియ ఆవరణలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి అర్చేరీ క్రీడ పోటీలను శుక్రవారం పోలీస్ కమిషనర్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి వచ్చిన 230 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సీఎం కప్-2026 రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరచి మంచి గుర్తింపు తీసుకురావాలనన్నారు. క్రీడల ద్వారా క్రీడా స్ఫూర్తి పెంపొందుతుందని, గెలుపు మాత్రమే లక్ష్యం కాకుండా పాల్గొనడం కూడా ముఖ్యమని తెలిపారు. ఓటమికి భయపడకుండా నిరంతరం ప్రయత్నం చేయాలని అన్నారు.
యువత, విద్యార్థులు ఇతర అసామాజిక కార్యకలాపాలకు దూరంగా ఉండి క్రీడల్లో చురుకుగా పాల్గొనాలని, అదేవిదంగా గ్రామీణ క్రీడలను బలోపేతం చేయడం, గ్రామీణ స్థాయిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ క్రీడాలు ఉత్తమ చాంపియన్లను తయారు చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడా అధికారి సునీల్ కుమార్ రెడ్డి, ఆర్చరీ జిల్లా ప్రెసిడెంట్ సారంగపాణి, కార్యదర్శి పుట్టా శంకరయ్య, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి గోంగూర వెంకటేశ్వర్లు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి రామారావు, కోఆర్డినేటర్ ఆదర్శ్ కుమార్, జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ సెక్రటరీ, ఇతర కోచ్ లు, తల్లితండ్రులు మరియు కోచ్ సాంబమూర్తి పాల్గొన్నారు.