14 April, 2026 | 5:15 PM

Breaking News

రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •  

మంత్రి తుమ్మలను కలిసిన మున్సిపల్ చైర్ పర్సన్

21-02-2026 12:38 AM

కామారెడ్డి, ఫిబ్రవరి 20 (విజయ క్రాంతి):కామారెడ్డి జిల్లా కేంద్రానికి పర్యటన నిమిత్తం విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును శుక్రవారం  నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ కలిశారు. ఈ సందర్భంగా మంత్రిని సన్మానించారు. ఈ సందర్బంగా మంత్రి  చైర్ పర్సన్ ని అభినందిస్తూ కామారెడ్డి నగరాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని సూచించారు.

ఇప్ప ఉమారాణి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం తరుపున తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలని కోరుతూ షాలువాతో సత్కరించారు. అనంతరం  జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర లను  మున్సిపల్ చైర్ పర్సన్ ఉమారాణి శ్రీనివాస్ మర్యాద పూర్వకంగా శాలువా తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, కామారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షులు గూడెం శ్రీనివాస్ రెడ్డి రెడ్డి,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పండ్ల రాజు, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.