calender_icon.png 15 November, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్స్య కార్మికుల అభివృద్ధికి కృషి

14-11-2025 11:54:40 PM

కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు అన్నెబోయిన సుధాకర్

నకిరేకల్,(విజయక్రాంతి): మత్స్య కార్మికుల సంక్షేమ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అన్నెబోయిన సుధాకర్ అన్నారు. శుక్రవారం శాలిగౌరారం మండల పరిధిలోని మాధవరం కలాన్ లోని రామసముద్రం చెరువులో జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లలను చెరువులోకి వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మత్స్య కార్మికులు ఆర్థికంగా బలోపితం అయ్యేందుకు ప్రభుత్వం 6,లక్షలకు పైగా చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేసిందని, మత్స్య కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.