15-11-2025 12:00:00 AM
- 27 నుంచి దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీలో 60 పోస్టులకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్‌ను శుక్రవారం జారీ చేసింది. సైంటిఫిక్ ఆఫీసర్స్, సైంటిఫిక్ అసిస్టెంట్స్, ల్యాబోరేటరీ టెక్నీషియన్స్, ల్యాబ్ అసిస్టెంట్స్ పోస్టులకు నో టిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 27 నుంచి డిసెంబర్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నా రు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సదర్శించాలని బోర్డు నోటిఫికేషన్‌లో తెలిపింది.