‘మంజీర’కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపునకు కృషి
- సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి, జూన్ 24 (విజయక్రాంతి): మంజీర వన్యప్రాణి అభయా రణ్య కేంద్రానికి అంతర్జాతీయ స్థాయి లో గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రభు త్వం కృషి చేస్తోందని సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. సంగారెడ్డి సమీపంలోని అభయారణ్య కేంద్రాన్ని సోమవారం రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిప్రసాద్, జాయింట్ సెక్రటరీ ప్రశత జీతో కలిసి పరిశీలించారు. అభయారణ్య కేంద్రం వివరాలను వారికి తెలియ జేశారు. నీటిలో, భూమిపై నివసించే పశుపక్ష్యాదులకు, జంతువులకు ఉత్తమమైన ప్రాంతమని తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా అభయారణ్యాలను అభివృద్ధి చేసే రాంసర్ సంస్థతో ఒప్పందం కుదిరిందని, దీంతో మంజీర అభయారణ్యా నికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రానుందని పేర్కొన్నారు. మంజీర నీటి ప్రదేశంలో తొమ్మిది ద్వీపాలు ఉన్నాయని, అభయారణ్యం సరిహద్దు నుంచి 1000 మీటర్ల వరకు ఎకోసెన్సిటిన్ జోన్ నోటిఫై చేసినట్లు వెల్లడించారు. అనంతరం జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీధర్‌రావు మాట్లాడుతూ.. అభయారణ్య కేంద్రంలో 303 రకాల పక్షులు, 14 జాతుల ఉభయ చరాలు, 57 జాతు ల చేపలు, 32 రకాల సీతాకోక చిలుకలు, 31 సరీసృపాలు, జంతువులు సహా ఇతర జీవులు నివాసం కలిగి ఉన్నాయని తెలిపారు.






