13 July, 2026 | 9:55 PM

Breaking News

తప్పకుండా ఆల్బెండాజోల్ మాత్రలు తీసుకోవాలి   •   33/11 కెవి అచ్చంపేట సబ్ స్టేషన్ లో ఫైవ్ ఎంవిఏ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన ఎస్ఇ శాలియా నాయక్   •   నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •   డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •  

పెండింగ్ వేతనాలు చెల్లించాలి

25-06-2024 05:44 AM

కలెక్టరేట్ ఎదుట పంచాయతీ కార్మికుల ధర్నా

మెదక్, జూన్ 24 (విజయక్రాంతి): ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం మెదక్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలడుగు సుధాకర్ మాట్లాడుతూ.. గత 8 నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. మల్టీపర్పస్ పని విధానం రద్దు చేయాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీపీవో యాదగిరికి అందజేశారు. ధర్నాలో సీఐటీ యూ జిల్లా కార్యదర్శి బస్వరాజు, కోశాధి కారి నర్సమ్మ, గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి ఆసీఫ్ తదితరులు పాల్గొన్నారు.