28 June, 2026 | 11:48 PM

వ్యభిచార ముఠా గుట్టురట్టు

14-06-2024 12:10 AM

ఐదుగురు నిర్వాహకుల అరెస్టు 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 13 (విజయక్రాంతి): నగరంలో ఒకవైపు మాదకద్ర వ్యాల విక్రయదారులు (డ్రగ్ పెడ్లర్లు).. మరోవైపు వ్యభిచార దందా నిర్వాహకులు చెల రేగిపోతున్నారు. తాజాగా ఓ వ్యభిచార ముఠా గుట్టురట్టు చేశారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు. ఇతర రాష్ట్రాల (ఏపీ, వెస్ట్‌బెంగాల్, త్రిపుర) నుంచి అమ్మాయిలను హైదరాబాద్‌కు తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని ఎస్సార్ నగర్, జూబ్లీహిల్స్ ప్రాం తాల్లో వ్యభిచార దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులకు అందిన పక్కా సమాచారంతో బుధవారం అర్ధరాత్రి ఓ హోటల్‌లో తనిఖీలు నిర్వహించి వ్యభిచార ముఠాను అరె స్టు చేశారు.

వ్యభిచార దందా నిర్వహిస్తున్న సూర్యకుమారి అలియాస్ రాణి(38), కే విజయ శేఖర్ రెడ్డి (49), అర్కోటిక్ ముఖర్జీ (30), వేణుగోపాల్  బాలాజీ(50), కైలారు కీర్తితేజ(29)ను అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆరుగురు అమ్మాయిలను రెస్క్యూ హోంకు తరలించారు. మరో ఇద్దరు తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. కస్టమర్ల కోరిక మేరకు ఆ యువతులను హోట ల్స్‌కు, ఫామ్‌హౌజ్‌లకు పంపిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 

ముఠా సభ్యుల నుంచి రూ. 89,500 నగదు, 2 కార్లు, 3 ద్విచక్ర వాహనాలు, 18 సెల్‌ఫోన్లు, 2 ల్యాప్‌టాప్‌లు, డెబిట్ కార్డులు, చెక్‌బుక్‌లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులపై గతంలోనూ పలు స్టేషన్ల పరిధిలో ఇదే తరహా కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.