03-02-2026 12:00:00 AM
అధికారులను ఆదేశించిన ఐటీడీఏ పీఓ రాహుల్
భద్రాచలం, ఫిబ్రవరి 2, (విజయక్రాంతి): గిరిజన దర్బార్ లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించడానికి వచ్చే గిరిజన కుటుంబాలకు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్ లో వివిధ సమస్యల గురించి విన్నవించడానికి వచ్చిన గిరిజనుల నుండి యూనిట్ అధికారుల సమక్షంలో ఆయన అర్జీలు స్వీకరించి,
ఐటీడీఏ పరిధిలో ఉన్నవి వెంటనే పరిష్కరించి, మిగతా వాటిని సంబంధిత అధికారులకు పంపుతూ అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన అన్నారు. గిరిజన దర్బార్ కు ఎక్కువ శాతం గిరిజనులు పోడు భూముల పట్టాల కొరకు, గిరి వికాసం ద్వారా సబ్సిడీపై కరెంటు, బోరు, మోటార్ల కొరకు, పోడు భూముల పట్టాలు ఆన్లైన్ చేయించుట కొరకు, స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పెంపొందించుకోవడానికి ఆర్థిక వెసులుబాటు కల్పించుట కొరకు,
అలాగే భూ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు ,గిరిజన గ్రామాలలో వ్యవసాయం చేసుకోవడానికి బోరు, మోటార్లు ఇప్పించుట కొరకు, మారుమూల ప్రాంత గిరిజన గ్రామాలకు వెళ్లడానికి రోడ్డు సౌకర్యం, కరెంటు ఇప్పించుట కొరకు, నూతనంగా మత్య సొసైటీలు ఏర్పాటు కొరకు, వితంతు, ఒంటరి మహిళ, ఆసరా పెన్షన్లు ఇప్పించుట కొరకు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో జీవనోపాధి పెంపొందించుకోవడానికి వ్యక్తిగత శిక్షణలు ఇప్పించుట కొరకు, అలాగే దీర్ఘకాలిక వ్యాధులకు వైద్యం చేయించుకోవడా నికి ఆర్థిక సహాయం అందించుట కొరకు,
ఇందిరమ్మ ఇండ్లు కేటాయింపులో జరిగిన తప్పులను సరిదిద్దుట కొరకు గిరిజనులు అర్జీలు పెట్టుకున్నారన్నారు. డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారి అశోక్, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ మధుకర్, డి టి ఆర్ ఓ ఎఫ్ ఆర్ లక్ష్మీనారాయణ, ఏపీఓ పవర్ వేణు,ఎస్ డిసి ఉదయ్ కుమార్, ఆర్ సి ఓ గురుకులం అరుణకుమారి, ఏ డి ఎం హెచ్ ఓ సైదులు, ఏవో సున్నం రాంబాబు,
ఉద్యానవన అధికారి ఉదయ్ కుమార్, ఏ పీ ఓ పవర్ వేణు, పి వి టి జి అధికారి గన్య, మేనేజర్ ఆదినారాయణ,ఐసిడిఎస్ సూపర్వైజర్ అనసూయ, జేడియం హరికృష్ణ, ఎల్ టి ఆర్ డి టి నాగేశ్వరరావు, హౌసింగ్ ఏఈ హేమంత్, ఇతర విభాగాలకు చెందిన సిబ్బంది లింగా నాయక్, మోహన్, భార్గవి, రామ్ కుమార్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.