ప్రభుత్వ బడుల బలోపేతానికి కృషి చేయాలి
12-08-2026 12:06 AM
సర్పంచ్ మల్లికార్జున్
శంకర్‌పల్లి, ఆగస్టు 11 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి ప్రతి ఒ క్కరు కృషి చేయాలని చందిప్ప సర్పంచ్ మ ల్లికార్జున్ అన్నారు. సోమవారం ప్రాథమికోన్నత పాఠశాల లో యంగ్ ఇండియా వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు షూస్ ను అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఉన్నత స్థాయి చదువుల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు బాగా చదువుకొని గ్రామానికి, వారి తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జయరాం, ఉపాధ్యాయులు శ్రీరామ్ గౌడ్, నర్సింలు, వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.






