12 August, 2026 | 2:26 AM

సోలార్ స్కాంపై విచారణ జరగాలి

12-08-2026 01:32 AM

కేంద్ర మంత్రికి ఎంపీ రఘునందన్‌రావు ఫిర్యాదు  

హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): రాష్ట్రంలో సోలార్ స్కాంపై విచారణ జరిపించాలని కోరుతూ ఎంపీ రఘునందన్‌రావు మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో 200 యూనిట్ల వరకు కరెంట్ ఉచితమని చెప్పారని, కేంద్ర డబ్బులను రాష్ట్రం మళ్లిస్తుందన్నారు.

హర్ గర్ బిజిలి ముక్త్ యోజన పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్రం లో 40 వేల ఇళ్లను గుర్తించారని, 200 యూనిట్లు వాడుతున్న వాళ్ల ఇళ్లపై సోలార్ పెట్టేందుకు రాష్ట్రం కూడా గుర్తించిందన్నారు. ప్రభుత్వం టెండర్లకు పిలిస్తే ఒక ఇంటిపై రెండు కిలోల యూనిట్ల ఏర్పాటుకు లక్షా 36 వేలకు ఒక కంపెనీ టెండర్ దక్కించుకుందని, సబ్ కాంట్రాక్ట్.. రూ. 86 వేలకే ఇచ్చారన్నారు. మొత్తం రూ.200 కోట్ల మోసమని ఆరోపించారు.