calender_icon.png 17 June, 2025 | 1:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధితుల సమస్యల తక్షణ పరిష్కారానికి కృషి చేయాలి

16-06-2025 07:35:13 PM

ఎస్పీ శరత్ చంద్ర పవార్...

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధితుల సమస్యల తక్షణ పరిష్కారానికి కృషి చేయాలని నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్(SP Sharath Chandra Pawar) పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 45 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు.

ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. బాధితుల సమస్యలు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకొవాలని, పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి చట్ట పరంగా బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని అన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరకమైన చర్యలు చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగించే వారి పట్ల కటినంగా వ్యవహరించాలని అన్నారు.