11 August, 2026 | 1:33 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

యువత స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలి

16-06-2025 07:41 PM

మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల..

నల్లగొండ పట్టణంలో గిఫ్ట్ ట్రీ ప్రారంభం..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): నిరుద్యోగ యువతీ యువకులు స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి(Former Municipal Chairman Burri Srinivasa Reddy), పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి(Congress Party President Gummala Mohan Reddy)లు అన్నారు. నల్గొండ పట్టణంలోని శివాజీ నగర్ లో పృథ్వీరాజ్ నూతనంగా ఏర్పాటు చేసిన గిఫ్ట్ ట్రీని సోమవారం నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... యువత ప్రభుత్వ ఉద్యోగాలపైనే కాకుండా స్వయం ఉపాధి అవకాశాలపై దృష్టి సారించాలని సూచించారు. 

స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకుంటే తాను ఉపాధి పొందడంతో పాటు మరి కొంతమందికి ఉపాధి కల్పించవచ్చని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి నల్గొండ పట్టణంలో సెట్విన్ తో పాటు పలు కార్యక్రమాలను ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్,మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, నల్లగొండ, కనగల్ మాజీ జడ్పిటిసిలు వంగూరి లక్ష్మయ్య, నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ తో పాటు గడిగ హిమబిందు శ్రీనివాస్, ఆలకుంట్ల మోహన్ బాబు, మారగోని గణేష్, వజ్జ రమేష్, కత్తుల కోటి, మహిళా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుబ్బ రూపా అశోక్ సుందర్, ఎగ్గడి సుజాత, సూరెడ్డి సరస్వతి, 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు మామిడి కార్తీక్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, 48 వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పాదం అనిల్, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సిద్దు, కంచర్ల ఆనంద్ రెడ్డి, శ్యామ్, రాజశేఖర్ , చింతపల్లి గోపాల్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.