6 July, 2026 | 4:16 PM

Breaking News

అనుమతి లేని తరగతులను సీజ్ చేసిన ఎంఈఓ రాజయ్య   •   ఎకో టూరిజం అభివృద్ధి చేయాలి: సీఎం రేవంత్​ రెడ్డి   •   ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి   •   8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •  

విద్యాశాఖ నూతన అసిస్టెంట్ డైరెక్టర్గా శ్రీమతి కే. విజయలక్ష్మి

16-06-2025 07:31 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ పి. రామారావు సమక్షంలో జిల్లా విద్యాశాఖ నూతన అసిస్టెంట్ డైరెక్టర్గా శ్రీమతి కే. విజయలక్ష్మి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కే. విజయలక్ష్మి గద్వాల జిల్లాలో సూపర్డెంట్ గా పనిచేసి, పదోన్నతిపై నిర్మల్ జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా నియామకం పొందారు. అక్కడి విధుల నుండి విడుదలై ఈరోజు నిర్మల్ జిల్లాలో విద్యాశాఖ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి మరియు సిబ్బంది అందరూ ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ పర్యవేక్షకులు వెంకటరమణ, శ్రావణి, సమన్వయకర్తలు సలోమికరుణ, రాజేశ్వర్, లింబాద్రి, సీనియర్ నాయకులు పోశెట్టి, మహేశ్వర్, మాధురి, జూనియర్ సహాయకులు కృష్ణవేణి, ప్రసన్న మరియు విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.