2 July, 2026 | 10:51 AM

Breaking News

సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •   కాంట్రాక్ట్ పనులను పంచాయతీ సిబ్బందితో చేయించడం తగదు   •   పిచ్చికుక్క వీరంగం.. 10 మందికి తీవ్రగాయాలు.!   •   సిర్గాపూర్ పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌వో   •   నకిలీ అక్రెడిటేషన్ కార్డు విషయమై పోలీసులకు ఫిర్యాదు   •  

సాగర్ సందర్శకులు దాసి చిత్రకళా నిలయాన్ని సందర్శించేలా కృషి

16-06-2025 01:16 AM

నాగార్జునసాగర్, జూన్ 15: అంతర్జాతీయ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ ను సందర్శించే పర్యాటకులు బుద్ధవనం, నాగర్జున కొండ,నాగార్జునసాగర్ డ్యాం లాంటి పర్యటక ప్రాంతాలతో పాటు దాసి సుదర్శన్ స్మారక చిత్రకళా నిలయాన్ని సందర్శించే విధంగా అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని ప్రముఖ గాయకుడు కవి నకిరేకల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బెల్లి యాదయ్య అన్నారు.

నందికొండ మున్సిపాలిటీ నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని దాసి సుదర్శన్ స్మారక చిత్రకళ నిలయంలో ఆదివారం మహాకవి శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా ఏర్పాటుచేసిన శ్రీ శ్రీ సాహిత్యం- సమకాలీనత అనే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైనారు. ముందుగా అహ్మదాబాద్  విమాన ప్రమాదంలో అసువులు బాసిన వారికి నివాళులర్పించిన అనంతరం  ఆయన మాట్లాడుతూ మహాకవి గురజాడ భావా జాలాన్ని, భాషా జాలాని,సాహిత్యాన్ని ముందు తరం వారికి తెలియచేయడానికి వచ్చిన గొప్ప కవి శ్రీశ్రీ అని అన్నారు కమ్యూనిజం భావాలతో కమ్యూనిజం భావాలతో వచ్చే కవిత ఐనా, కళా యినా,చిత్రకళ అయిన భావితరాలకు ఎర్రజెండాల రెపరెపలాడుతూ ఉంటుందన్నారు.

అనంతరం మహాకవి శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం శ్రీశ్రీ సొంత దస్తూరి తో కార్టూన్లతో ఉన్నటువంటి గొప్ప పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు వ్యక్తలు మాట్లాడుతూ మహాకవి శ్రీశ్రీ గురించి ఆయన కవితల గురించి తెలియజేస్తూ దానితోపాటు దాసి సుదర్శన్ తో తమకున్న పరిచయాన్ని స్నేహాన్ని నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కార్టూనిస్ట్ నరసింహ, ప్రభాకర్ కస్తూరి, రామలింగయ్య, రామ్మోహన్ రాజు,తిరుమల, స్వతంత్ర, కిరణ్మయ్,పాండు, మున్నా బాయ్,జగన్మోహన్ బాలేశ్వర్, తదితరులు పాల్గొన్నారు