2 July, 2026 | 12:04 PM

Breaking News

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •  

పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

16-06-2025 01:19 AM

యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి వేముల గోపీనాథ్

 శాలిగౌరారం, జూన్ 15 : కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు పేద ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని తుంగతుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేముల గోపీనాథ్ ఆదివారం తెలిపారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు.

తుంగతుర్తి నియోజకవర్గం వ్యా ప్తంగా ఎమ్మెల్యే మందుల సామేలు ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. శాలిగౌరారం మండల వ్యాప్తంగా సుమారు 6506 మంది రైతులకు 54 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.రైతు భరోసా, అర్హులైన పేద కుటుంబాలకు రేషన్ కార్డులను మంజూరు చేసిందన్నారు.

అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎమ్మెల్యే మందుల సామేలపై కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. గతంలో ఏ సంక్షేమ పథకమైన బిఆర్‌ఎస్ వాళ్లకి వచ్చేదని నేడు పార్టీలకతీతంగా రేషన్ కార్డులు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయన్నారు.