సాంకేతిక సేవలకు నోచుకోని పంచాయతీలు
డిజిటల్ సేవల కోసం ఏళ్లుగా ఎదురు చూపులు
ఉట్నూర్, మార్చి 9 (విజయక్రాంతి): గ్రామ పంచాయతీలకు డిజిటల్ సేవలు అందించాలని లక్ష్యంతో 2017లో తెలంగాణ ఫైబర్ గ్రేడ్, (టి.ఫైబర్ పథకాన్ని) గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పెరుగుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా ఇంటింటికి ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యం పెట్టుకున్నారు. మిషన్ భగీర థ పైప్లైన్ తో పాటు ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు కేబుల్ ను ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ భవనాలకు సోలా ర్ ప్లేట్లు, బ్యాటరీలు, ఇతర సామాగ్రిని ఏర్పా టు చేశారు. లక్షల రూపాయలు వెచ్చించి పథకాన్ని ప్రారంభించిన, నేటి వరకు ఆచరణలోకి రాలేదని పలువురు వాపోతున్నారు..
గ్రామాల్లో అమలవుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, నిధుల ఖర్చు, పంచాయతీ సిబ్బంది జీవితపత్యాలు, ఆదా య, వయ్యాళ్లు, పలు రకాల ధ్రువీకరణ పత్రా ల జారీ వంటి డిజిటల్ రూపంలో తీసుకురావాలన్నదే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. పంచా యతీలో డిజిటల్ సేవల విధానాన్ని ఐటీ శాఖకు అనుసంధానిస్తే కలిగే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఇంటర్నెట్ కేబుల్ లో అనుసంధానమే జరగలేదు. జిల్లాలోని 473 గ్రామ పంచాయతీ భవనాల్లో టీ ఫైబర్ సేవల కోసం సోలార్ ప్లేట్ల ఏర్పాటు ద్వారా విద్యుత్ వసతి కల్పించాలని నిర్ణయించారు. గ్రామ పంచాయతీలలో సోలార్ ప్లేట్లు, గదిలో బ్యాటరీలు ఇతరాత్ర పరికరాలు ను ఏర్పాటు చేశారు. గతంలో కొన్ని గ్రామ పంచాయతీలకు కంప్యూటర్లను అందించి కొన్నా ళ్లు ఆపరేటర్లు సైతం నియమించుకున్నారు. ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో ఇవి వృధాగా మారాయి.. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని గ్రామా ల్లో సాంకేతిక సేవలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.




