24 April, 2026 | 2:16 AM

కోర్టులలో మౌలిక వసతుల కల్పనకు కృషి

24-04-2026 12:41 AM

బార్ అసోసియేషన్ అధ్యక్షులు నారపరాజు శ్రీనివాసరావు

హుజూర్ నగర్, ఏప్రిల్ 23: న్యాయస్థానాలలో మౌలిక వసతుల కొరతతో పాటుగా సిబ్బంది కొరత సమస్యలను స్టేట్ బార్ కౌ న్సిల్ మెంబర్ సాముల రాంరెడ్డి సహకారం తో పరిష్కారానికి కృషిచేస్తానని బార్ అసోసియేషన్ అధ్యక్షులు నారపరాజు శ్రీనివాస రావు తెలిపారు. గురువారం బార్ అసోసియేషన్ హాల్ నందు జరిగిన ప్రమాణ స్వీకా ర కార్యక్రమంలో మాట్లాడారు...న్యాయ పీ ఠానికి న్యాయవాదులకు మధ్య సత్సంబంధాలు కొనసాగించాలని అప్పుడే న్యాయ స్థానాలలో అన్ని పనులు సజావుగా సాగుతాయని అన్నారు.

కోర్టు సిబ్బందికి న్యాయవాదులకు మధ్య ఏదైనా సమస్య ఉత్పన్నమైతే దాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరిస్తానని ఆయన న్యాయవాదులకు హామీ ఇచ్చారు. అంతకుముందు సీనియర్ న్యాయవాది కాల్వ శ్రీనివాసరావు ను ప్రోటీన్ స్పీకర్ గా ఎన్నుకోవడంతో ఆయన బార్ అసోసియేషన్ కార్యవర్గము చేత పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు.

అధ్యక్షులుగా నారపరాజు శ్రీనివాసరా వు, ఉపా ధ్యక్షులుగా జక్కుల వీరయ్య, ప్రధాన కార్యదర్శిగా రమణారెడ్డి, సంయుక్త కార్యదర్శిగా కోలా రమాదేవి,గ్రంథాలయ కార్యదర్శిగా ధూళిపాల శ్రీనివాసరావు, కోశాధికారిగా గొట్టే ప్రశాంత్, క్రీడల మరియు సాంస్కృతిక కార్యదర్శిగా రామావత్ అడవి రాముడు, కార్యవర్గ సభ్యులుగా షేక్ మౌలాభి, చిట్టిపోతుల రమేష్, షేక్ నాగపాష, బుడిగ  నరేష్, జక్కుల నవీన్, భూక్య నాగరాజు నాయక్,నర్సింగ్ సతీష్ ప్రమాణ స్వీకారం చేశారు.ఎన్నికల అధికారులు ఎంఎస్ రాఘవరావు, వట్టికూటి అంజయ్యలు ఎన్నికలలో గెలిచిన కార్యవర్గానికి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని గజమాలలు,పూలదండలతో ఘనం గా సన్మానించారు. కార్యక్రమంలో ఏజీపీలు, పీపీలు, సీనియర్, జూనియర్ న్యాయ వాదు లు,పలువురు ప్రముఖులు,పాల్గొన్నారు.