24 April, 2026 | 2:17 AM

రాజకీయలబ్ధి కోసమే కాలేశ్వరంపై కాంగ్రెస్ చెడు ప్రచారం

24-04-2026 12:43 AM

బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్             

సూర్యాపేట, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): రాజకీయ లబ్ధి కోసమే కాలేశ్వరంపై కాం గ్రెస్ పార్టీ చెడు ప్రచారం చేస్తుందని మాజీ రాజ్యసభ సభ్యుడు, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

కాళేశ్వరంపై ఘోష్ కమిటీ ఆరోపణలు చెల్లవని కోర్టు చెప్పడం రేవంత్ కి చెంపపెట్టు లాంటి సమాధానమన్నారు. దీంతో కాళేశ్వరం పై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలు తప్పని తేలిపోయాయన్నారు. ఇది నిజంగా ఘోష్ కమిటీ కాదనీ ఇది ము మ్మాటికి కాంగ్రెస్ తొత్తు కమిటీయే అన్నారు. ఒక్క పిల్లర్ కుంగితే వెంటనే సరిచేసే అవకాశం ఉన్నా పట్టించుకోక పోవడం వారి స్వార్థపూరిత బుద్ధికి నిదర్శనం అన్నారు.

ఒక్క పిల్లర్ చూపి కాళేశ్వరం కూలిందని తప్పుడు ప్రచారం చేశారన్నారు. కాళేశ్వరం అంటే కేసీఆర్ ఆనవాళ్ళు అని, ఆయన కాళేశ్వరం కట్టడంతోనే లక్షల ఎకరాల్లో పంటలు పుష్కలంగా పండాయి అన్నారు. నీళ్లొస్తే కేసీఆర్ కి పేరొస్తుందని కుట్ర చేస్తున్నారన్నారు. ఇప్పటికి నీళ్లిచ్చే అవకాశం ఉన్నా రైతులపై కక్ష కట్టి నీళ్లు ఇవ్వకపోవడం బాధాకరమన్నా రు. తక్షణమే కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపేర్ చే యాలనీ, లేకపోతే మళ్లీ రైతులతో కలిసి తప్పక ఉద్యమం తప్పదన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు వై.వెంకటేశ్వర్లు, ని మ్మల శ్రీనివాస్ గౌడ్, నెమ్మది బిక్షం, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.