calender_icon.png 18 January, 2026 | 9:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

18-01-2026 12:00:00 AM

నా వంతు సహకారమందిస్తా

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు

టీఎన్జీవో డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించిన సీఎస్

హైదరాబాద్, జనవరి 17(విజయక్రాంతి) : ఉద్యోగుల సమస్యల సాధన కోసం నా వంతు సహకారమందిస్తానని ప్రభుత్వ ప్ర ధాన కార్యదర్శి రామకృష్ణారావు పేర్కొన్నా రు. టీఎన్జీవో సంఘం గత ఎనిమిది దశాబ్దాలుగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేస్తున్నదన్నారు.శనివారం తెలంగాణ ఎన్జీవోల కేంద్ర సంఘం ఆధ్వర్యంలో ప్రచురించిన 2026 డైరీ, క్యాలెండర్ ను సీఎస్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లే బాధ్యత ఉద్యో గులదేనని అన్నారు. ఉద్యోగులు, ప్రభుత్వం వేర్వేరు కాదని, సమస్యలు ఉన్నంత వరకు సంఘాలు ఉంటాయని అన్నారు.

చిన్న స్థా యిలో పనిచేసే ఉద్యోగి హక్కులకోసం పో రాడే స్వభావం టీఎన్జీవో సంఘానికి ఉన్నదని పేర్కొన్నారు.అంతకు ముందు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్, ఎస్‌ఏం హుస్సేనీ ముజీబ్‌లు మాట్లాడుతూ ఉద్యోగుల ప్రధాన సమస్యలైన పీఆర్సీ, పెం డింగ్ డీఏల విడుదల, పెండింగ్ బిల్లులు, హెల్త్‌కార్డ్స్ మంజూరు, పాత పెన్షన్ విధా నం అమలు తదితర డిమాండ్లను పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. కార్యక్రమంలో టీఎన్జీవో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, కోశాధికారి ము త్యాల సత్యనా రాయణ, నాల్గో తరగతి రాష్ట్ర అధ్యక్ష ప్రధా న కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.