calender_icon.png 19 January, 2026 | 1:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

67 ఏళ్ల వ్యక్తికి నడిచే ఆనందం

18-01-2026 12:00:00 AM

కాలు తొలగించాల్సిన పరిస్థితి నుంచి కాపాడిన మలక్‌పేట్ కేర్ హాస్పిటల్ వైద్యులు

మలక్‌పేట్, జనవరి 17 (విజయక్రాంతి): కిందికాలు తొలగించాల్సిందేనని పలువురు వైద్యులు చెప్పిన ఒక కేసు, చివరకు కాలును కాపాడిన ఆశాజనక కథగా మారింది. తిరుపతికి చెందిన 67 ఏళ్ల వృద్ధుడికి, కేర్ హాస్పి టల్స్, మలక్‌పేట్ వైద్యులు విజయవంతంగా చికిత్స అందించి అతని కాలును రక్షిం చారు. ఈ రోగి గత కొన్ని రోజులుగా కుడి కాలులో తీవ్రమైన నొప్పి, పెద్దవేలు నల్లబడటం వంటి సమస్యలతో ఆసుపత్రికి వచ్చా డు. రెండు నెలల క్రితం కూడా ఇలాంటి సమస్య రావడంతో, అప్పట్లో కాలులో రక్తప్రసరణ ఆగిపోయిందని గుర్తించి తిరుప తిలో శస్త్రచికిత్స చేశారు. శస్త్రచికిత్స తర్వాత కూడా మందులు వాడుతున్నా, పరిస్థితి మె రుగుపడలేదు. క్రమంగా పెద్దవేలు పాడైపోయే (గ్యాంగ్రీన్) పరిస్థితి ఏర్పడింది. 

తరువాత చేసిన స్కాన్లలో, కాలుకు వెళ్లే రక్తనాళంలో మళ్లీ గడ్డలు ఏర్పడి రక్తం వెళ్లడం పూర్తిగా ఆగిపోయింది. ఈ కారణంగా పలువురు ఆసుపత్రుల్లో కాలు తొలగించాల్సిం దేనని చెప్పారు. అయితే, చివరిసారిగా ఆశ తో రోగి కేర్ హాస్పిటల్స్, మలక్పేట్‌ను సంప్రదించాడు. అక్కడి వైద్యులు పూర్తిగా పరీక్షిం చి, మళ్లీ శస్త్రచికిత్స చేసి రక్తప్రసరణ తిరిగి ప్రారంభించవచ్చని నిర్ణయించారు. శస్త్రచికిత్స సమయంలో ప్రత్యేక యంత్రాల సహా యంతో కాలుకు మళ్లీ రక్తం బాగా వెళ్లుతున్నట్టు నిర్ధారించారు. రోగి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కోలుకుని, ఆరవ రోజున ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యాడు. నెల తరువాత జరిగిన ఫాలోఅప్లో పెద్దవేలు వద్ద ఉన్న గాయం పూర్తిగా మానిపోయింది. ప్ర స్తుతం రోగి నొప్పిలేకుండా నడవగలుగుతున్నాడు.

ఈ విధంగా కాలు తొలగింపును నివారించగలిగారు. రోగి ఆనందంతో మాట్లాడుతూ, అన్ని చోట్ల కాలు తీసేయాలన్నారు. ఇక నడవలేనేమోనని భయపడ్డాను. కానీ ఇప్పుడు నడవగలుగుతున్నాను. నా కాలు కాపాడిన కేర్ హాస్పిటల్స్ వైద్యులకు నా జీవితాంతం కృతజ్ఞుడిని అన్నారు. కేర్ హాస్పిటల్స్ సీనియర్ కార్డియోథొరాసిక్, వాస్కులర్ సర్జన్ డాక్టర్ సుధీర్ గండ్రకోట మాట్లాడుతూ.. ‘కాలులో రక్తప్రసరణ ఆగిపోవడాన్ని పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటారు.

ఇది ముఖ్యంగా పొగతాగేవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. పొగతాగడం, సరైన ఆహారం తీసుకోకపోవడం, శారీరక చురుకుదనం లేకపోవడం వంటి జీవనశైలి అల వాట్లు ఈ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతాయి. అలాగే షుగర్, హైబీపీ, కొలెస్ట్రాల్ ఉన్నవారిలో ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. సకాలంలో చికిత్స అందకపోతే కాలు తొలగించే పరిస్థితి వస్తుంది. ఈ రోగికి సమయా నికి సరైన చికిత్స అందించడంతో కాలు కాపాడగలిగాం’ అన్నారు. కేర్ హాస్పిటల్స్, మలక్పేట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ ఎడ్ల మాట్లాడుతూ.. రోగి నడవగలగడం అంటే అతని జీవితం మళ్లీ సాధారణ స్థితికి రావడమే. ఇలాంటి ఫలితాలే కేర్ హాస్పిటల్స్లో మా వైద్య సేవల లక్ష్యం అని తెలిపారు.