18-01-2026 12:00:00 AM
మెదడు, ఊపిరితిత్తుల వ్యాధి నుంచి రక్షించిన వైద్యులు
హైదరాబాద్, జనవరి 17 (విజయక్రాంతి): మెదడు, ఊపిరితిత్తులు, మూత్రపిం డాలు, రోగనిరోధక వ్యవస్థను ఒకేసారి ప్రభావితం చేసిన అత్యంత ప్రాణాపాయ వ్యాధితో బాధపడిన 17 ఏళ్ల బాలికను మెడికవర్ ఆస్పత్రి వైద్యుల సమిష్టి కృషితో చికి త్స చేసి, ప్రాణాపాయం నుంచి బయటకు తీసుకొచ్చారు. 2025 ఆగస్టులో బాలికకు అకస్మాత్తుగా మూర్ఛలు రావడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. చికిత్సకు స్పందించకపోవడంతో ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి డీప్ సెడేషన్ ఇవ్వాల్సి వచ్చింది. రక్తపరీక్షల్లో ఆటోఇమ్యూన్ వ్యాధి లక్షణాలు బయటపడటంతో స్టెరాయిడ్లు, ఇమ్యూన్ మాడ్యులేటిం గ్ మందులతో చికిత్స ప్రారంభించారు.
తదుపరి రోజుల్లో ఆమెకు తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, శ్వాసకోశ వైఫల్యం, రక్తపో టు ప్రమాదకరంగా పడిపోవడం, మూత్రపిండాలు పనిచేయకపోవడం వంటి సమ స్యలు ఏర్పడి డయాలిసిస్ అవసరమైంది. డ్రగ్-రెసిస్టెంట్ బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా గుర్తించారు. ఈ అత్యంత సంక్లిష్ట కేసును డాక్టర్ ఘనశ్యామ్ బృందం, డాక్టర్ ఏ. రఘుకాంత్, డాక్టర్ చైతన్య, డాక్టర్ రంజి త్, డాక్టర్ కమల్ కిరణ్ బృందం, డాక్టర్ శివ్ అనూప్‌లతో కూడిన పల్మోనాలజి, న్యూరాలజీ, క్రిటికల్ కేర్, నెఫ్రాలజీ వైద్యుల బృం దం సమన్వయంతో చికిత్సను అందించారు. అడ్వాన్స్‌డ్ ఐసీయూ చికిత్స, లక్ష్యిత యాంటీబయోటిక్స్, నిరంతర పర్యవేక్షణతో బాలిక క్రమంగా కోలుకొని ప్రస్తుతం పూర్తిగా స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.