3 April, 2026 | 3:25 AM

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

03-04-2026 01:49 AM

రాజాపేట గ్రామసభలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట గ్రామంలో గురువారం నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్ల న్న పాల్గొన్నారు. గ్రామ ప్రజలతో సమస్యల ను విన్నారు. గ్రామసభలో పలువురు గ్రామస్థులు తాగునీరు, రహదారులు, డ్రైనేజ్, పింఛన్లు,ఇందిరమ్మ ఇండ్లు, పంట పొలాలకు నీళ్లు, ఇతర ప్రాథమిక సదుపాయాలకు సం బంధించిన సమస్యలను మల్లన్న దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి సమస్యను నమోదు చేసు కొని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని మల్లన్న హామీ ఇచ్చారు.

సమస్యల పరిష్కారం తన ప్రధాన బాధ్యత అని, సంబంధిత అధికారులతో, ప్రభుత్వంతో మాట్లాడి ప్రతి సమస్యకు స్థిరమైన పరిష్కారం తీసుకురావడానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకోవాలని, ఎవరూ అన్యాయం గురి కాకుండా చూడాలని అధికారులకు సూచించారు. కాగా గ్రామసభలో ప్రజల నుంచి నేరుగా సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. అంబులెన్స్ లేదని ప్రజలు చెప్పగా వెంటనే ఎంహెచ్‌వోతో ఫోన్‌లో తీన్మార్ మల్లన్న మాట్లాడి, సమకూర్చాలని ఆదేశించారు.  

హనుమాన్ శోభాయాత్రలో మల్లన్న

హనుమాన్ జయంతి సందర్భంగా యా దాద్రి జిల్లా రాజాపేటలో గురువారం నిర్వహించిన హనుమాన్ శోభాయాత్రలో ఎమ్మె ల్సీ తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి శోభాయాత్రలో నడు చుకుంటూ వెళ్లి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లన్న మా ట్లాడుతూ.. హనుమాన్ స్వామి ధైర్యం, భక్తితో యువత అచంచల విశ్వాసం, శక్తి, నిబద్ధతను అలవర్చుకుని దేశ అభివృద్ధిలో భాగస్వాము లు కావాలని సూచించారు. సమాజంలో ఐక్య త, ధర్మం నిలవాలంటే హనుమాన్ ఆశీస్సులు అవసరమని అన్నారు.

పాపన్నగౌడ్‌కు మల్లన్న నివాళి

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాల్గొని, పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గొప్ప యోధుడు, ప్రజల హక్కుల కోసం పోరాడిన మహానుభావుడని కొనియాడారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు నేటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగుతూ, ప్రజల కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.