19 June, 2026 | 3:06 AM

గోదాదేవి రంగనాథుడి సన్నిధిలో గవర్నర్ ప్రత్యేక పూజలు

19-06-2026 02:40 AM

కుషాయిగూడ, జూన్ 18 (విజయక్రాంతి): హెచ్బీ కాలనీలోని శ్రీరంగగిరి శ్రీ గోదాదేవి రంగనాథ స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న వికారి శ్వారి క్రతు జీవహోత్తవ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా గురువారం పాల్గొన్నారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ అర్చకులు, నిర్వాహకులు గవర్నర్కు పూర్ణకుంభ స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం నిర్వహించిన ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న గవర్నర్, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు గవర్నర్ చెక్కులు పంపిణీ చేశారు. విద్య ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకుని సమాజ సేవలో ముందుండాలని విద్యార్థులకు సూచించారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు బండారు నీలం రెడ్డి కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.