1 September, 2026 | 2:24 AM

గ్రామపంచాయతీ కార్యాలయ భవనాల నిర్మాణానికి కృషి

01-09-2026 01:33 AM

ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి

కోదాడ, ఆగస్టు 31: నియోజకవర్గంలోని ప్రతి గ్రామపంచాయతీకి కార్యాలయ భవన నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి తెలిపారు. సోమవారం మంగలితండ గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయ భవనాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు.

ఉపాధి హామీ నిధులు రూ.20 లక్షలతో గ్రామపంచాయతీ కార్యాలయ భవనం నిర్మించినట్లు తెలిపారు. శిథిలావస్థలో ఉన్న గ్రామపంచాయతీ భవనాల స్థానంలో కొత్త భవనం నిర్మిస్తామన్నారు. కూచిపూడిలో ఉపాధి హామీ నిధులు రూ.12 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనం ప్రారంభించారు.

కాపుగల్లులో రూ.24 లక్షలతో నిర్మించిన రెండు అంగన్వాడీ భవనాలను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచులు ధారావత్ బాబ్జీ నాయక్, కాసాని సంధ్య వెంకటేశ్వర్లు, దొంతగాని అప్పారావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవేటి రామారావు, మండల పార్టీ అధ్యక్షుడు అల్సకాని శరభేశ్వరరావు, మండల పార్టీ ఉపాధ్యక్షుడు ఇర్లా సీతారాంరెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కొత్తా గురవయ్య, తొండపు సతీష్, కాపుగల్లు పీఏసీఎస్ చైర్మన్ నంబూరి సూర్యం, ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.