4 April, 2026 | 1:49 AM

సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ

04-04-2026 12:06 AM

దమ్మపేట, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ శుక్రవారం గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో దమ్మపేట మండలానికి చెందిన 34 మంది ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్న లబ్ధిదారులకు మొత్తం రూ.10,56,000 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి  చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎం ఎల్ ఎ జారే మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయాన్ని కుటుంబ అవసరాల కోసం సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.

అనారోగ్యంతో ఎవరైనా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసిన వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. ప్రభుత్వం ద్వారా పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించే లక్ష్యంతో అత్యవసర సర్జరీలు కూడా రూ.30 లక్షల వరకు పూర్తిగా ఉచితంగా చేయించే అవకాశం తన ద్వారా కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి, దమ్మపేట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వాసం రాణి, ఎర్రా వసంతరావు, తదితరులు పాల్గొన్నారు.